https://oktelugu.com/

YCP vs TDP: ఓటీఎస్ రాజకీయం.. టీడీపీ, వైసీపీలో ఎవరు నెగ్గేనో?

YCP vs TDP: ఏపీలో ఓట్ల రాజకీయం అప్పుడే మొదలైంది. వైసీపీ సర్కారు చేయబోయే ప్రతీ పని ఓట్ల కోసమేనని టీడీపీ విమర్శిస్తోంది. అయితే, అలా విమర్శ చేయడం రాజకీయమేనని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తంగా ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయం మహా రంజుగా సాగుతోంది. తాజాగా హౌసింగ్ స్కీమ్ కూడా రాజకీయ రంగు పులుముకుంది. వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పథకం కింద లబ్ధిదారులు ఇళ్లు తీసుకోవాలని అధికార వైసీపీ చెప్తోంది. ఇందుకు కొంత […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 8, 2021 / 11:22 AM IST
    Follow us on

    YCP vs TDP: ఏపీలో ఓట్ల రాజకీయం అప్పుడే మొదలైంది. వైసీపీ సర్కారు చేయబోయే ప్రతీ పని ఓట్ల కోసమేనని టీడీపీ విమర్శిస్తోంది. అయితే, అలా విమర్శ చేయడం రాజకీయమేనని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తంగా ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయం మహా రంజుగా సాగుతోంది. తాజాగా హౌసింగ్ స్కీమ్ కూడా రాజకీయ రంగు పులుముకుంది. వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పథకం కింద లబ్ధిదారులు ఇళ్లు తీసుకోవాలని అధికార వైసీపీ చెప్తోంది. ఇందుకు కొంత డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటోంది. ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేయాలని టీడీపీ అంటోంది. ఇంతకీ ఓటీఎస్ హౌసింగ్ స్కీం ఏంటి.. ఇరు పార్టీలు ఎందుకు ఈ విషయమై రాజకీయం చేస్తున్నాయనే విషయమై ఫోకస్..

    YCP vs TDP

    నిరుపేదలకు హౌసింగ్ స్కీమ్ కింద ప్రభుత్వాలు ఇళ్లు నిర్మించి ఇస్తాయన్న సంగతి అందరికీ విదితమే. గత ప్రభుత్వాలు కాంగ్రెస్, టీడీపీ హయాంలోనూ అలా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. అయితే, ఈ స్కీమ్ కింద సర్కారు ఇచ్చే ఇసుక, సిమెంట్, నగదుకు తోడుగా లబ్ధిదారులు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అలా చేస్తేనే లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటారని స్కీమ్‌ను అలా రూపొందించారు అధికారులు. కాగా, లబ్ధిదారులు చెల్లించాల్సిన ఆ డబ్బులు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో వారికి ఆ ఇళ్ల హక్కులు దక్కలేదు. అయితే, వాటిని ఇతరులకు అమ్మడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కాబట్టి ఈ సారి ఈ పథకం కింద వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్)ద్వారా లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.14,400 కోట్లు రావాల్సి ఉండగా, రూ.10 వేల కోట్లు రద్దు చేసి, రూ.4,400 కోట్లు మాత్రమే లబ్ధిదారుల నుంచి వస్తాయని చెప్తోంది. కాగా, ఇలా చేయడంలో రాజకీయం ఉందనేది కాదనలేని అంశం. 13 లక్షల మంది ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందనున్నారు. అనగా 30 లక్షల ఓట్లు తమ ఖాతాలో పడతాయని అధికార వైసీపీ భావిస్తోంది.

    Also Read: AP Government employees: తప్పెవరిది?: ఏపీ ఉద్యోగులదా? జగన్ సర్కార్ దా?

    ఈ ఓటీఎస్ విషయమై వైసీపీ, టీడీపీ ఫైట్ నడుస్తోంది. ఓటీఎస్ స్కీమ్ కింద ఎవరూ డబ్బులు చెల్లించొద్దని చంద్రబాబు అంటున్నారు. బలవంతపు వసూళ్లు చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉచితంగా పేదలకు ఇళ్లు ఇస్తామని హామీ ఇస్తున్నారు. దాంతో అధికారంలో ఉన్నపుడు ఏం చేశారని వైసీపీ నేతలు చంద్రబాబుకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ పథకం లబ్ధిదారులు ఇష్టపూర్వకంగానే ఓటీఎస్ ద్వారా కొంత డబ్బు కట్టి ఇళ్లు పొందొచ్చని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు. తక్కువ మొత్తంతోనే ఇళ్లు రిజిస్టర్ అవుతాయని వివరిస్తున్నారు. రూరల్ ఏరియస్‌లో రూ.10 వేలు, సిటీ ఏరియాస్‌లో రూ.15 వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.20 వేలు చెల్లిస్తే స్కీమ్ 22(ఎ) ప్రకారం ఇంటి హక్కులు అందడంతో పాటు క్లియర్ టైటిల్ వస్తుందని, వైసీపీ నేతలు చెప్తున్నారు. చూడాలి మరి.. ఓటీఎస్ రాజకీయంలో టీడీపీనా లేక వైసీపీనా ఎవరు నెగ్గుతారో..

    Also Read: Pawan Kalyan: స్పందించని వకీల్ సాబ్.. సీఎం సాబ్ పై మంటే కారణమా !

    Tags