Chandrababu: సరైన నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు ఫెయిల్..?

Chandrababu: అపర చాణక్యుడికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకనాడు కేంద్రంలో చక్రం తిప్పిన ఆయన బోరున విలపించే స్థితికి వచ్చాడు. పార్టీని బలోపేతం చేయకుండా సమీక్షల పేరిట కాలం వెల్లదీస్తున్నాడు. ఆయన ఎవరో కాదండోయ్.. టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలేంటి.. ఇంతకీ ఆయన ఎందుకు అలా చేస్తున్నారు అనే విషయాలపై స్పెషల్ ఫోకస్.. రాజకీయాల్లో వ్యూహాలు ఉంటేనే రాజకీయ పార్టీ […]

Written By: Neelambaram, Updated On : December 8, 2021 11:15 am
Follow us on

Chandrababu: అపర చాణక్యుడికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకనాడు కేంద్రంలో చక్రం తిప్పిన ఆయన బోరున విలపించే స్థితికి వచ్చాడు. పార్టీని బలోపేతం చేయకుండా సమీక్షల పేరిట కాలం వెల్లదీస్తున్నాడు. ఆయన ఎవరో కాదండోయ్.. టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలేంటి.. ఇంతకీ ఆయన ఎందుకు అలా చేస్తున్నారు అనే విషయాలపై స్పెషల్ ఫోకస్..

Chandrababu

రాజకీయాల్లో వ్యూహాలు ఉంటేనే రాజకీయ పార్టీ మనగలుగుతుందని రాజకీయ పరిశీలకులు చెప్తుంటారు. అలా వ్యూహాలు వేయడంలో అపర చాణక్యుడిగా పేరుగాంచారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఉమ్మడి ఏపీకి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా పని చేసిన ఆయన విభజిత ఏపీకీ సీఎంగా పని చేశారు. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర ఓటమి పాలు కాగా, ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యారు. ఇక ఇటీవల కాలంలో టీడీపీ పరిస్థితి మరి అధ్వానంగా తయారైందని ఎన్నికల ఫలితాలే చెప్తున్నాయి. ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేవలం రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ గెలిచింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీ గెలిచి, చంద్రబాబు మనుగడను ప్రశ్నార్థకం చేసింది. ఈ క్రమంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోకుండా మున్సిపల్ ఎన్నికలపై సమీక్షల పేరిట టీడీపీ అధినేత టైం వేస్ట్ చేస్తున్నారనే అభిప్రాయం టీడీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది.

Also Read: Pawan Kalyan: స్పందించని వకీల్ సాబ్.. సీఎం సాబ్ పై మంటే కారణమా !

సమీక్షల పేరిట వ్యాఖ్యానాలు చేస్తూ, ప్రతీ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసినంత మాత్రాన టీడీపీ అధికారంలోకి రాదని కొందరు ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు మునుపటి మాదిరిగా ఆలోచించడం లేదని, ఒంటరితనం వల్లే ఆయన సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు ఇలా చేయడానికి కారణం ఆయనకు సలహాదారులుగా ఎవరూ సీనియర్ నేతలు లేకపోవడమేనని టాక్. చంద్రబాబు అధికారంలో లేకపోవడంతో ఆయనకు సలహాలిచ్చే వారు కూడా అయన వద్దకు రావడం లేదట. గతంలో పలువురు సీనియర్ నేతలు ఆయనకు పలు విషయాలపై సలహాలు, సూచనలు ఇచ్చేవారట. కానీ, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు ఆడియో లీక్, అనుభవం కలిగిన నేతలు ఎవరూ లేని నేపథ్యంలో చంద్రబాబు కూడా ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడటం లేదని తెలుస్తోంది. మొత్తంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలతో పార్టీ బలోపేతం అవుతుందా, మళ్లీ రాజకీయ అధికారంలోకి వస్తుందా అనే అనుమానాలను సొంత పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

Also Read: AP Government employees: తప్పెవరిది?: ఏపీ ఉద్యోగులదా? జగన్ సర్కార్ దా?

Tags