Homeఆంధ్రప్రదేశ్‌Janasena Party: జనసేనలోకి జన వరద.. ఆవిర్భావ సభ ముందు ఊపు..

Janasena Party: జనసేనలోకి జన వరద.. ఆవిర్భావ సభ ముందు ఊపు..

Janasena Party: జనసేనలోకి జన వరద మొదలైంది. ఆవిర్భావ సభ మార్చి 14కు ముందు ఆ పార్టీకి మంచి ఊపు వస్తోంది. ప్రజల్లోకి వెళ్లడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలనుకుంటున్న జనసేనకు ఈ పరిణామం కలిసి వచ్చేలా ఉంది. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. మార్చి 14న జనసేనాని పవన్ పార్టీ ఆవిర్భావ దినాన ఎలాంటి తూటాలు వదలుతాడు? ఏపీ ప్రభుత్వాన్ని ఎలా షేక్ చేస్తాడన్నది ఉత్కంఠగా మారింది.

జనసేనకు ఆవిర్భావ సభతో స్పందన బాగా వస్తోంది. జనసేనలోకి చేరికలు మొదలయ్యాయి. తాజాగా జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరికలు మొదలయ్యాయి. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

తూర్పు గోదావరి జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం డైరెక్టర్, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అల్లంకి నాగేశ్వరావు, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్లు కోటంశెట్టి సత్యనారాయణ, సలాది సుబ్రమణ్యం, రెడీమేడ్స్ వర్తక సంఘం వైస్ ప్రెసిడెంట్ వడగన వీరభద్రరావు, బోగిరెడ్డి బాబ్జి, సప్పా శ్రీనివాసరావులతో పాటు మరికొందరు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరంతా జనసేన కండువా కప్పుకున్నారు.

వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మనోహర్ గారు అంతా కలసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పీఏసీ సభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు.

ఆవిర్బావ సభకు ముందే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. ఇక పవన్ సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలకు టీడీపీ, వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు. ఇదే ఊపు కొనసాగిస్తే జనసేన ఏపీలో బలోపేతం కావడం ఖాయమని జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

  1. […] Pawan Kalyan Janasena: జనసేన పార్టీ ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు పార్టీకి ముందుకు నడిపించే నేతలు లేక కొంత ఆలస్యమైనా తరువాత క్రమంలో మార్పులు వస్తున్నాయి. ప్రతి జిల్లాలో పార్టీ శ్రేణులు పార్టీ కోసం ముందుకు వస్తున్నారు.ఇక ప్రభుత్వంపై పోరాడుతూనే పార్టీ విస్తరణకు పవన్ కల్యాణ్ నడుం కట్టారు. దీని కోసం ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకు గాను మార్చి 14న పార్టీ ఆవిర్భావాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular