స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం వెనకున్న అసలు కుట్ర బయటపడింది…!

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం విచారణ కీలక దశకు చేరుకుంది. ముందు స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం సరైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని…. వారి నిర్లక్ష్యం వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని కమిటీ తేల్చింది. అయితే మరింత విచారన జరిపించిన తర్వాత విచారణ కమిటీ అగ్నిప్రమాదం విషయం పక్కన పెడితే… రమేష్ ఆసుపత్రి వారు స్వర్ణ ప్యాలెస్ ను ఉపయోగించుకొని చాలా కుట్రలకు పాల్పడ్డారని బయటపెట్టారు. Also Read: సోము వీర్రాజు గేమ్ ప్లాన్ ఏమిటీ? వివరాల్లోకి వెళితే చాలా […]

Written By: Navya, Updated On : August 16, 2020 5:46 pm
Follow us on

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం విచారణ కీలక దశకు చేరుకుంది. ముందు స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం సరైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని…. వారి నిర్లక్ష్యం వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని కమిటీ తేల్చింది. అయితే మరింత విచారన జరిపించిన తర్వాత విచారణ కమిటీ అగ్నిప్రమాదం విషయం పక్కన పెడితే… రమేష్ ఆసుపత్రి వారు స్వర్ణ ప్యాలెస్ ను ఉపయోగించుకొని చాలా కుట్రలకు పాల్పడ్డారని బయటపెట్టారు.

Also Read: సోము వీర్రాజు గేమ్ ప్లాన్ ఏమిటీ?

వివరాల్లోకి వెళితే చాలా మంది పేషెంట్లకు కరోనా టెస్ట్ చేయకుండానే ఎక్స్ రే, సిటి స్కాన్ ద్వారా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారని…. అవసరం లేకపోయినా రెమిడెసివిర్ మందులను ఇచ్చి అధిక ఫీజులను చివరికి బిల్లుల రూపంలో వసూలు చేశారని తెలిపారు. వ్యాధి తీవ్రత లేకపోయినా కరోనా ఇంజెక్షన్లు ఇచ్చి అధిక ఫీజులు వసూలు చేశారని కమిటీ తెలిపింది.

ఇప్పటికే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్ బాబు పరారీలో ఉండగా ఈ సంచలన విషయాలు బయట పడిన నేపథ్యంలో ఖచ్చితంగా అతని అరెస్టుకు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేస్తామని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: పబ్లిసిటీకి ఒక ‘లిమిట్’ ఉంటుంది… ఒక మనస్’సాక్షి’ ఉంటుంది…!

ఇక ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఆసుపత్రి అధినేత రమేష్ పరారీలో ఉన్నారు కానీ ఆడియో సందేశాలు మాత్రం మీడియా కి పంపుతున్నారు. తప్పు చేయకపోతే పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావచ్చు కదా…. అని ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సరైన అనుమతులు తీసుకోలేదు. లోపల వైద్యం మొత్తం అక్రమంగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ శాఖలు ఏమి చేస్తున్నాయి..? ఇంత అక్రమం జరుగుతుంటే… వారి వైఖరి ఇంత నిర్లక్ష్యంగానా ఉండేది…? అని ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.