https://oktelugu.com/

Pawan vs Jagan: ప్రభుత్వ చర్యల వల్ల ఆంధ్రలో ఆ సామాజిక వర్గాన్ని మాత్రమే కాక తటస్తులను కూడా పవన్ కళ్యాణ్ ఆకర్షించాడా?

Pawan vs Jagan: ఏపీ ప్రభుత్వం జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్ల వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అన్ని వైపులా ఇరుకునపెడుతున్న పవన్ పై ఏపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలు ఇప్పుడు సామాన్యుల్లో, పవన్ సామాజికవర్గంతోపాటు తటస్థులను కూడా పవన్ వైపు మళ్లిస్తోంది. పవన్ పై సానుభూతితో ఏపీలోని చాలా మంది తటస్థులు ఇప్పుడు జనసేనాని వైపు చూస్తున్నారు. ఇది రాజకీయంగా వైసీపీకి చాలా దెబ్బ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 25, 2022 / 12:49 PM IST
    Follow us on

    Pawan vs Jagan: ఏపీ ప్రభుత్వం జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్ల వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అన్ని వైపులా ఇరుకునపెడుతున్న పవన్ పై ఏపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలు ఇప్పుడు సామాన్యుల్లో, పవన్ సామాజికవర్గంతోపాటు తటస్థులను కూడా పవన్ వైపు మళ్లిస్తోంది. పవన్ పై సానుభూతితో ఏపీలోని చాలా మంది తటస్థులు ఇప్పుడు జనసేనాని వైపు చూస్తున్నారు. ఇది రాజకీయంగా వైసీపీకి చాలా దెబ్బ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    Pawan vs Jagan

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్’ మూవీ ఈరోజు విడుదలైంది. తెలంగాణలో 5వ షోకు అనుమతి, బెనిఫిట్, ప్రీషోలు, టికెట్ రేట్లు పెంచి కేసీఆర్ సర్కార్ సహకరించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై పవన్ ఫ్యాన్స్, ఆ సామాజికవర్గంతో పాటు ప్రజల్లోనూ మంచి పేరు వచ్చింది. అయితే ఏపీలో మాత్రం జగన్ సర్కార్ టికెట్ రేట్లు పెంచకుండా తొక్కేసింది.సినిమాపై ఉక్కుపాదం మోపింది. ఇది ప్రజల్లోనూ జగన్ సర్కార్ పై వ్యతిరేకతను పెంచుతోంది. సామాన్యులు, తటస్తులు కూడా పవన్ సినిమాను అడ్డుకొని ఆర్థికంగా దెబ్బతీస్తున్న ఏపీ సర్కార్ తీరును తప్పుపడుతున్నారు.

    ఏపీలో ‘భీమ్లానాయక్’ మూవీపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అదనపు షోలకు, టికెట్ ధరల పెంపునకు అనుమతి నిరాకరించింది. జీవో నం.35ను స్టిక్ట్ గా అమలు చేసింది. లేకుంటే థియేటర్లు సీజ్ చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్ తన సినిమాను ఎంతగా ఏపీలో తొక్కేద్దామనుకుంటున్నా జగన్ ను శరణు వేడకుండా అంతే ధీటుగా ప్రతిస్పందించారు. టాలీవుడ్ పెద్దలలాగా తాను వంగి దండాలు పెట్టనని.. డబ్బుల కోసం కక్కుర్తి పడే మనిషిని కాదని సవాల్ చేశారు.

    ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను పవన్ అభిమానులు అడ్డుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ సినిమాపై ఆంక్షలు పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి ఈ చర్య షాకింగ్ అని చెప్పొచ్చు. అభిమానులు ఏకంగా అధికార పార్టీ మంత్రులనే అడ్డుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీన్ని బట్టి పవన్ పై ఎంత సానుభూతి వ్యక్తమవుతోందో.. అదే వ్యతిరేకత వైసీపీ సర్కార్ పై ఎంత వ్యక్తమవుతుందో అర్థం చేసుకోవచ్చు.

    Also Read: Bheemla Nayak Ticket Price in AP: భీమ్లానాయక్ టికెట్ రేట్స్ చూస్తే మీ గూబ గుయ్ మంటది?

    ఏపీలో కాపులు ప్రబలంగా ఉన్నారు. రాజకీయాలను మార్చేంత స్థాయిలో ఉన్నారు. ప్రతిసారి రెడ్డి, కమ్మ సామాజికవర్గాల చేతుల్లో మోసపోయి.. ద్వితీయ శ్రేణి నేతలుగా పరిమితమవుతున్నారు. కాపులకు కేవలం డిప్యూటీ సీఎం పదవులతో సరిపెడుతున్నారు. కాపుల్లో అనైక్యత కూడా రెడ్డి, కమ్మ సామాజికవర్గాల రాజ్యాధికారానికి కారణమవుతోంది. ఇప్పటికే కాపులు దీనిపై సమాలోచనలు చేస్తూ ఐక్యత కోసం ఇటీవల మీటింగులు పెట్టుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వం తీరు చూశాక.. కాపు నేతలు, ఆ సామాజికవర్గంలో జనసేనానిపై సానుభూతి వ్యక్తమవుతోంది. తమ వాడిని ఇలా ఇబ్బంది పెడుతున్న జగన్ తీరుపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయట.. కాపులే కాదు తటస్థుల్లో కూడా పవన్ కళ్యాణ్ పై ఓరకమైన ఆకర్షణ ఏర్పడుతోంది. ఇది అంతిమంగా జగన్ సర్కార్ పై వ్యతిరేకతకు కారణమవుతోంది.

    ఏపీ ప్రభుత్వ చర్యల వల్ల ఆంధ్రలో పవన్ సొంత సామాజిక వర్గాన్ని మాత్రమే కాక తటస్తులను కూడా పవన్ కళ్యాణ్ వైపు ఆకర్షించేలా చేస్తోంది. వైసీపీ అనవసరంగా పవన్ తో పెట్టుకొని మెజార్టీ ప్రజలను దూరం చేసుకుంటుందనే అపవాదు వస్తోంది.

    Also Read: Bheemla Nayak Donations: ‘భీమ్లా నాయక్’ కోసం విరాళాలు.. ఎవరి జేబుల కోసం ?

    Recommended Video: