Operation Sindoor strike: పహల్గాంలో పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడితో దేశం ఉలిక్కిపడింది. 26 మందిని ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. దీనిపై విచారణ జరిపిన భారత్ పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు గుర్తించింది. దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. వంద మందికిపైగా ఉగ్రవాదులను చంపేసింది. అయినా ఇప్పటికీ ఆపరేషన్ సిందూర్‌పై మన దేశంల కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తాజాగా
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ సైనిక గౌరవంపై చర్చకు దారితీసింది. భారత దళాలు చేసిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో పేలుళ్లు జరగలేదన్నట్లు చెప్పిన ఆయన వ్యాఖ్య పార్టీ రేఖను దాటి దేశవ్యాప్తంగా వివాదానికి తావు ఇచ్చింది. ఇలాటి సమయంలో ఓ వీడియో తాగాజా వెలుగులోకి వచ్చింది..
భారత్ సత్తాపై వీడియో..
రేవంత్ వ్యాఖ్యల తరువాత, సామాజిక మాధ్యమాల్లో భారత్ వైమానిక దళం శక్తిని చూపే ఆధారాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్ యూఏవీ(యూన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్) ద్వారా సేకరించబడిన ఒక వీడియోలో పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంలోని మందాల నాలా వద్ద 20 మంది పాకిస్తాన్ బెటాలియన్ జావాన్ల శవాలను మోసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో బయటకు రావడంతో ‘‘భారత్ కొట్టిన దెబ్బ ఎంత తీవ్రంగా ఉందో ఇదే సాక్ష్యం’’ అంటూ నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
మన సైనిక శక్తికి నిదర్శనం..
2025 మే 9న నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ భారత సైన్య వ్యూహాత్మక విజయం గా గుర్తింపు పొందింది. ఇది డ్రోన్ సమన్వయం, హైపర్ సరిగ్గా గైడ్ చేయబడ్డ పీజీఎం (ప్రీసియస్ గైడెడ్ ముటిషన్) దాడుల సమ్మేళనంతో అమలు కావడం విశిష్టత. లష్కర్, జైష్ ఏ మహ్మద్ కార్యాలయాలపై కచ్చితమైన దాడులు జరిగాయి. ఈ దాడుల తీవ్రత వల్లే పీఓకేలో పాకిస్తాన్ ఉగ్రవాదులతోపాటు సైనికులు చనిపోయారు. తాజా వీడియోనే ఇందుకు నిదర్శనం.
సైనికుల త్యాగం ఎప్పటికీ సందేహానికి అతీతం. ఆపరేషన్ సిందూర్ పట్ల దేశవ్యాప్తంగా గర్వం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో ఇదే భారత శౌర్యం, బాంబులు కాదు, దెబ్బ మాట్లాడింది అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలతో తాత్కాలికంగా రాజకీయ మంటలు చెలరేగినప్పటికీ, యూఏవీ దృశ్యాలతో ఆపరేషన్ సిందూర్ అసలైన విజయం మళ్లీ వెలుగులోకి వచ్చింది.
Yes …the world saw how your army ran away and hid in the bushes, terrified of the Indian Army’s wrath.
20 POK Battalion caught on Indian UAV evacuating b0d!€§ from their posts inside Pakistani territory.
OperationSindoor
9 May 2025, 9 AM IST
Mandala Nala, LOC PoonchThis is… https://t.co/glsUhV045k pic.twitter.com/OWGYnqZ4z6
— OsintTV (@OsintTV) October 31, 2025