Operation Sindoor: భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులో పహల్గాం సందర్శనకు వచ్చిన హిందూ పర్యాటకులను కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. గతేడాది ఏప్రిల్ లో ఈ ఘటన జరిగింది. దీంతో భారత్ వ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రజలు దేశభక్తి చాటారు. దీంతో భారత్ మే 7 నుంచి 10వ తేదీ వరకు ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. వంద మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ప్రతిగా పాకిస్తాన్ భారత్‌పై దాడులకు తెగబడింది. దీంతో భారత్ వాటిని తిప్పి కొట్టడంతోపాటు పాకిస్తాన్‌లోని 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. ఇప్పటికీ పాకిస్తాన్ మరమ్మతులు చేసుకుంటోంది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం..
భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ మూడు నుంచి నాలుగు రోజుల్లో పూర్తయింది. అయితే దాని పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ తీవ్ర దెబ్బకు శోకంలో మునిగిపోయింది, ఆయుధ సరఫరాదారులైన చైనా, అమెరికా కూడా దూరంగా తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి భారత్ తీర్చిన ఈ చర్య దేశీయ ఉద్వేగాలను రేకెత్తించింది.
టర్కీ, అజర్‌బైజాన్‌కు దెబ్బ
ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్‌ను సమర్థించిన టర్కీ, అజర్‌బైజాన్ గట్టి దెబ్బలే తగిలాయి. ఈ దేశాలు పహల్గాం దాడిని సమర్థించడం భారతీయుల్లో కోపాన్ని రేకెత్తించింది. ఫలితంగా భారత పర్యాటకులు ఈ దేశాలకు వెళ్లడం ఆపేశారు, ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగింది.
పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం..
అజర్‌బైజాన్‌లో 2024తో పోల్చితే భారతీయ సందర్శకులు 64 శాతం తగ్గారు. టర్కీలో కూడా 34 శాతం ఫుట్‌ఫాల్ డ్రాప్ జరిగింది. భారత్‌లో దేశభక్తి ఉద్వేగం ఈ బాయ్‌కాట్‌కు కారణమైంది. ఈ దేశాల టూరిజం ఆదాయాలు పడిపోయాయి.
ఈ ఆపరేషన్ సైనిక విజయంతోపాటు, పర్యాటక బాయ్‌కాట్ ద్వారా భారతీయులు స్వయంప్రేరణగా ప్రతీకారం తీర్చుకున్నారు. పాకిస్తాన్ మిత్రదేశాలు ఆర్థికంగా బాధపడుతుంటే, భారత్ ప్రజా డిప్లొమసీ బలపడింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు మరిన్ని దేశాలను అప్రమత్తం చేసింది.