Site icon OkTelugu

Pakistan Cricket Board : పాకిస్తాన్ పరిస్థితిని చెప్పిన రమీజ్ రాజా.. బిచ్చమెత్తుకోవడమే..

Pakistan Cricket Board

Pakistan Cricket Board

Pakistan Cricket Board : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాకపోతే ఆ దేశానికి 50 శాతం నిధులు ఐసీసీ నుంచి వస్తుంటాయి. ఐసీసీకి 90% దాకా రెవెన్యూ బిసిసిఐ నుంచి వస్తుంది. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ని ప్రశ్నిస్తోంది. అర్థంపర్థం లేని వ్యవహారంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది.

పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ కు స్థానిక కార్పొరేట్ సంస్థల సపోర్టు అంతంత మాత్రమే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గొప్పగా చెప్పుకునే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో మెన్ ఆఫ్ ది మ్యాచ్, మెన్ ఆఫ్ ది సిరీస్ వాటి పురస్కారాలలో ప్లేయర్లకు వంట నూనె ప్యాకెట్.. మేకలు ఇస్తున్నారు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇంతటి దయనీయంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేనిపోని పంతాలకు పోతోంది అందువల్ల అక్కడ క్రికెట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

టి20 వరల్డ్ కప్ లో టీమిండియాతో ఫిబ్రవరి 15న జరిగే లీగ్ మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆ ప్రభావం ఆ జట్టు మీద తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ జట్టుకు సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ గనుక ఐసీసీ ఆ నిర్ణయాలు తీసుకొని ఉంటే.. అవి గనక అమల్లోకి వస్తే అప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి గురించి ఆ దేశ మాజీ ఆటగాడు రమీజ్ రాజా గతంలోని కీలక ప్రకటన చేశారు. ” డబ్బులు వస్తేనే ఒక వ్యవస్థను ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుంది. పాక్ క్రికెట్ బోర్డు కు ఐసీసీ నుంచి సగం రెవెన్యూ వస్తుంది. ఐసీసీ కి 90 శాతం రెవెన్యూ బిసిసిఐ నుంచి వస్తుంది. ఈ లెక్కన పాకిస్తాన్లో క్రికెట్ బతుకుతోంది.. క్రికెట్ ఆటను ప్లేయర్లు ఆస్వాదిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం భారత్ అని” రమీజ్ రాజా పేర్కొన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేకపోయినప్పటికీ భారత్ లాంటి కొదమ సింహంతో పోట్లాట పెట్టుకోవడం నిజంగా హాస్యాస్పదమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Exit mobile version