India war of attrition: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని నెలలుగా భారత్–పాకిస్తాన్ యుద్ధాని తానే ఆపానని చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ సందర్బం వచ్చిన ప్రతీసారి అదే ముచ్చట చెబుతున్నాడు. ఇక ఇటీవల భారత్–పాక్ యుద్ధంలో 8 విమానాలు కూలాయని ప్రకటించారు. కానీ ఆ విమానాలు ఎవరివో మాత్రం వెల్లడించలేదు. ఇలాంటి తరుణంలో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆపరేషన్ అనంతరం భారత్ వైమానిక దళం సాధించిన వ్యూహాత్మక విజయాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. పాకిస్తాన్ వాయుసేనకు ఈ దాడి తీరని నష్టాన్ని మిగిల్చిందని ఆస్ట్రేలియన్ సైనిక విశ్లేషకుడు టామ్ కూపర్ వెల్లడించారు.
ట్రంప్ పాత మాటలకు కొత్త మలుపు
సమీపంలో ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దృష్టిని ఆకర్షించాయి. భారత్ అణు దాడికి సిద్ధమవుతుందనే భయంతోనే పాకిస్తాన్ యుద్ధ విరమణ కోరిందని ఆయన పేర్కొన్నారు. అయితే భారత వైపు నుంచి ముందుగా స్పష్టమైన హెచ్చరికే వెళ్లిందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి పాకిస్తాన్ అణు దాడి చేస్తేనే ప్రతిస్పందిస్తాం అని భారత్ అమరికా ఉపాధ్యక్షుడికి స్పష్టంగా చెప్పింది. కానీ ట్రంప్ చెప్పిన వాదనకు భిన్నం ఉంది. కానీ ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో మన దేశం సృష్టించిన భయ ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఆస్ట్రేలియా ఎనలిస్ట్ విశ్లేషణ..
ఆస్ట్రేలియన్ మిలటరీ ఎనలిస్ట్ టామ్ కూపర్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళానికి భారీ నష్టం జరిగింది. మొత్తం 19 యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. 13 హ్యాంగర్లు నాశనం అయ్యాయి. అవాక్స్ సిస్టమ్ నిర్వహణ హాంగర్ కూడా దెబ్బతింది. ఐసీ–130 లాజిస్టిక్ ఎయిర్‌క్రాఫ్ట్, పది ఫైటర్ జెట్లు కూలిపోయాయి. 11 ఇంధన రీఫ్యూయల్ ట్యాంకులు దెబ్బతన్నాయి. ఈ స్థాయి నష్టం పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో లోతైన గ్యాప్‌లను బయటపెట్టిందని టామ్ కూపర్ విశ్లేషించారు.
పాకిస్తాన్‌లో భయం..
ఆపరేషన్ అనంతరం పాకిస్తాన్ సైనిక అధికారులు రక్షణ భయాందోళనలోకి చేరిపోయారని సమాచారం. అణు దాడిపై భారత్ గట్టి ప్రతిస్పందనకు సిద్ధంగా ఉందని గ్రహించి, ఇస్లామాబాద్ తక్షణ యుద్ధ విరమణ కోరినట్లు విశ్లేషక వర్గాల అభిప్రాయం. భారత్ మాత్రం ఈ ఆపరేషన్‌ను కేవలం ప్రతీకార చర్యగా కాకుండా, కచ్చితమైన టార్గెట్ మరియు సాంకేతిక ఆధిపత్య ప్రదర్శనగా చూపించింది.
ట్రంప్ ‘అణు’ రాజకీయం
ట్రంప్ వ్యాఖ్యలు పాకిస్తాన్ భయాన్ని అతిశయోక్తిగా చూపించాయన్న వాదనలూ ఉన్నాయి. కానీ వాస్తవంగా ఆ సమయంలో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో గందరగోళం నెలకొనడం, సరిహద్దు వద్ద సైన్య కదలికలు పెరగడం, అంతర్జాతీయ మాధ్యమాల్లో భారత్ ధైర్యవంతమైన వైఖరికి వచ్చిన ప్రశంసలు ఈ భయాన్ని నిజమని సూచిస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్ భారత సైనిక సామర్థ్యం, గగనతల దాడుల్లో నిర్దిష్ట లక్ష్యసాధనకు ప్రతీకగా నిలిచింది. ఉపయోగించిన టాక్టిక్స్, ఇంటెలిజెన్స్ సమన్వయం, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ టూల్స్ అన్నీ కలిసిపడి ఈ మిషన్‌ను విజయవంతం చేశాయి.