Homeజాతీయ వార్తలుOperation Sindoor strike: ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బ.. పాకిస్తాన్‌ వైమానిక దళం తుక్కుతుక్కు..!

Operation Sindoor strike: ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బ.. పాకిస్తాన్‌ వైమానిక దళం తుక్కుతుక్కు..!

Operation Sindoor strike: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొన్ని నెలలుగా భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధాని తానే ఆపానని చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ సందర్బం వచ్చిన ప్రతీసారి అదే ముచ్చట చెబుతున్నాడు. ఇక ఇటీవల భారత్‌–పాక్‌ యుద్ధంలో 8 విమానాలు కూలాయని ప్రకటించారు. కానీ ఆ విమానాలు ఎవరివో మాత్రం వెల్లడించలేదు. ఇలాంటి తరుణంలో ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆపరేషన్‌ అనంతరం భారత్‌ వైమానిక దళం సాధించిన వ్యూహాత్మక విజయాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. పాకిస్తాన్‌ వాయుసేనకు ఈ దాడి తీరని నష్టాన్ని మిగిల్చిందని ఆస్ట్రేలియన్‌ సైనిక విశ్లేషకుడు టామ్‌ కూపర్‌ వెల్లడించారు.

ట్రంప్‌ పాత మాటలకు కొత్త మలుపు
సమీపంలో ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి దృష్టిని ఆకర్షించాయి. భారత్‌ అణు దాడికి సిద్ధమవుతుందనే భయంతోనే పాకిస్తాన్‌ యుద్ధ విరమణ కోరిందని ఆయన పేర్కొన్నారు. అయితే భారత వైపు నుంచి ముందుగా స్పష్టమైన హెచ్చరికే వెళ్లిందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి పాకిస్తాన్‌ అణు దాడి చేస్తేనే ప్రతిస్పందిస్తాం అని భారత్‌ అమరికా ఉపాధ్యక్షుడికి స్పష్టంగా చెప్పింది. కానీ ట్రంప్‌ చెప్పిన వాదనకు భిన్నం ఉంది. కానీ ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో మన దేశం సృష్టించిన భయ ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

ఆస్ట్రేలియా ఎనలిస్ట్‌ విశ్లేషణ..
ఆస్ట్రేలియన్‌ మిలటరీ ఎనలిస్ట్‌ టామ్‌ కూపర్‌ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌ వైమానిక దళానికి భారీ నష్టం జరిగింది. మొత్తం 19 యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. 13 హ్యాంగర్లు నాశనం అయ్యాయి. అవాక్స్‌ సిస్టమ్‌ నిర్వహణ హాంగర్‌ కూడా దెబ్బతింది. ఐసీ–130 లాజిస్టిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్, పది ఫైటర్‌ జెట్లు కూలిపోయాయి. 11 ఇంధన రీఫ్యూయల్‌ ట్యాంకులు దెబ్బతన్నాయి. ఈ స్థాయి నష్టం పాకిస్తాన్‌ రక్షణ వ్యవస్థలో లోతైన గ్యాప్‌లను బయటపెట్టిందని టామ్‌ కూపర్‌ విశ్లేషించారు.

Also Read: ఇండియా లేకపోతే బ్రిటన్ అడుక్కుతినేదే.. కన్నీళ్లు పెట్టిన బ్రిటన్‌ యుద్ధ వీరుడు

పాకిస్తాన్‌లో భయం..
ఆపరేషన్‌ అనంతరం పాకిస్తాన్‌ సైనిక అధికారులు రక్షణ భయాందోళనలోకి చేరిపోయారని సమాచారం. అణు దాడిపై భారత్‌ గట్టి ప్రతిస్పందనకు సిద్ధంగా ఉందని గ్రహించి, ఇస్లామాబాద్‌ తక్షణ యుద్ధ విరమణ కోరినట్లు విశ్లేషక వర్గాల అభిప్రాయం. భారత్‌ మాత్రం ఈ ఆపరేషన్‌ను కేవలం ప్రతీకార చర్యగా కాకుండా, కచ్చితమైన టార్గెట్‌ మరియు సాంకేతిక ఆధిపత్య ప్రదర్శనగా చూపించింది.

ట్రంప్‌ ‘అణు’ రాజకీయం
ట్రంప్‌ వ్యాఖ్యలు పాకిస్తాన్‌ భయాన్ని అతిశయోక్తిగా చూపించాయన్న వాదనలూ ఉన్నాయి. కానీ వాస్తవంగా ఆ సమయంలో పాకిస్తాన్‌ రక్షణ వ్యవస్థలో గందరగోళం నెలకొనడం, సరిహద్దు వద్ద సైన్య కదలికలు పెరగడం, అంతర్జాతీయ మాధ్యమాల్లో భారత్‌ ధైర్యవంతమైన వైఖరికి వచ్చిన ప్రశంసలు ఈ భయాన్ని నిజమని సూచిస్తున్నాయి.

ఆపరేషన్‌ సిందూర్‌ భారత సైనిక సామర్థ్యం, గగనతల దాడుల్లో నిర్దిష్ట లక్ష్యసాధనకు ప్రతీకగా నిలిచింది. ఉపయోగించిన టాక్టిక్స్, ఇంటెలిజెన్స్‌ సమన్వయం, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ టూల్స్‌ అన్నీ కలిసిపడి ఈ మిషన్‌ను విజయవంతం చేశాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version