Supreme Court Slams UP Govt: ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటనలో ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై న్యాయస్థానం అసంతృప్తి వ్య్తం చేసింది. నిందితులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేని ఆగ్రహం వ్యక్తం చేసింది. లఖింపూర్ దుర్ఘటనలో నలుగురు రైతులతోపాటు ఎనిమిది మంది కోల్పోవడంతో ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఉత్తరప్రదేశ్ కు చెందిన శివకుమార్ త్రిపాఠి, సీఎన్ పాండా అనే న్యాయవాదులు సీజేఐకి లేఖలు రాశారు.

దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం లఖింపూర్ ఘటనపై విచారణ చేపట్టింది. సర్కారు తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో యూపీ సర్కారు నివేదిక అందజేసింది. కానీ ఈ ఘటనపై ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.
యూపీ ప్రభుత్వం తీరుపై కోర్టు ఆగ్రహించింది. కేసు పురోగతిలో ఎలాంటి ప్రగతి లేకపోవడంతో అనుమానాలు వస్తున్నాయని పేర్కొంది. స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే కేసు ముందుకు వెళ్లడం లేదని ఆక్షేపించింది. దర్యాప్తు చేపట్టకుండా కేసు ముందుకు ఎలా వెళ్తుందని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పాలని సూచించింది.
దసరా పండగ ఉన్నందున కేసు విచారణ అక్టోబర్ 20న చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. యూపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఘటన జరిగిన తరువాత చేపట్టాల్సిన చర్యలపై ఎందుకు తాత్సారం వహిస్తున్నారో చెప్పాలని సూచించింది. ఇంత దారుణ సంఘటన జరిగితే నిర్లక్ష్యం పనికిరాదని చెప్పింది. దీనిపై ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలియజేసింది.