Samantha Gives Strong Reply: విడాకుల రూమర్లను నిజం చేస్తూ సమంత, నాగ చైతన్య గతవారం అధికారిక ప్రకటన చేసేశారు. వారుఇరువురు ఇక భార్యభర్తలుగా ఉండడం లేదని, స్నేహితుల్లా ఎప్పటికీ కలిసే ఉంటామని పేర్కొంటూ ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. దీంతో నాలుగేళ్ల నాగ చైతన్య- సమంత వివాహ బంధానికి బ్రేక్ పడింది. ఒక్కసారిగా ఈ విషయం జనాల్లో హాట్ టాపిక్ అయింది. చై- సామ్ విడాకుల ఇష్యూపై ఏవేవో కారణాలు చెప్పుకుంటూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు. వాటిలో ముఖ్యంగా తనకు చాల ఎఫైర్స్ ఉన్నాయని, గతంలో చాల అబార్షన్లు చేయించుకున్నదని సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టు వారు పరిధి దాటి సమంతను ట్రోల్ చేశారు. వాటన్నిటికీ దీటుగా ఈరోజు సమంత తన ఇంస్టాగ్రామ్ వాల్ పై ఒక పోస్ట్ పెట్టింది.

నాగచైతన్యతో విడాకులకు సిద్దమైన అనంతరం ఆమె ఆ బాధ నుండే బయటపడలేకపోతున్నాని, నేను అవకాశవాదిని, పిల్లలు వద్దనుకుంటున్నాను అని, అబార్షన్లు చేయించుకుంది అని తనను ఇలా వ్యక్తిగతంగా ఎందుకు దెబ్బతిస్తున్నారని మండిపడింది. తాను ఇప్పటికే చాల బాధలో ఉన్నానని, ఇలా రూమర్స్ ప్రచారం చేయడం సరికాదని హెచ్చరించింది. అంతేకాదు కొందరు కావాలని ఇలా చేసిన తనపై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. ఎవరు ఎన్ని అనుకున్న కఠిన సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.