Andhra Pradesh: రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు. ప్రభుత్వ సొమ్ము పరుల పాలులా ఉంది వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారుల నియామకంలో నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలువురిని సలహాదారులుగా నియమించినా మళ్లీ కొత్తగా నియామకాలు చేపడుతూ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎంత మంది ఉన్నారో తెలియడం లేదు. కానీ దీనిపై ఇంకా స్పష్టత రావడం లేదు.
ప్రభుత్వం వారికి రూ. లక్షల్లో వేతనాలిస్తోంది. పలు శాఖలకు సలహాదారుల పేరుతో తమకు ఇష్టమొచ్చిన వారిని నియమిస్తోంది. అది కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఎంచుకుంటోంది. రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తోంది. ఇప్పుడున్న సలహాదారుల్లో అందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో కోర్టుల్లో ఎదురుదెబ్బలే తింటోంది. జీవోల విడుదలలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. సలహాదారులు పేరుకే కానీ ఏనాడూ సలహాలు ఇచ్చింది లేదు. సూచనలు పాటించింది లేదు. కానీ వేతనాలైతే నెలనెల తీసుకుంటూ ప్రభుత్వ సొమ్మును పందికొక్కుల్లా మెక్కుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో జగన్ ప్రభుత్వం అప్రదిష్టను మూటగట్టుకుంటోందని చెబుతున్నారు.
Also Read: CM Jagan: అంతులేని అభిమానం.. సీఎం జగన్‌కు బంగారు పుష్పాలతో అభిషేకం.. ఎక్కడంటే!
సలహాదారులతో ప్రభుత్వానికి ఒరిగిందేమీ లేదు. కానీ ఇప్పటివరకు వారి సంపాదన మాత్రం పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం దీనిపై భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోజురోజుకు ప్రభుత్వ సలహాదారుల సంఖ్య రెట్టింపవుతూనే ఉంది. తాజాగా చిత్తూరు కు చెందిన ఓ నేతను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.
Also Read: Secretariat employees: ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సచివాలయ ఉద్యోగులు