AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై జగన్ దృష్టి సారించారు. కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే గవర్నర్ విశ్వభూషన్ హరంచందణ్ తో సమావేశమై చర్చించారు. మంత్రివర్గ కూర్పు, ప్రమాణస్వీకారం తదితర విషయాలపై మాట్లాడారు. ఇక ముహూర్తం ఈ నెల 11న ఖరారు కావడంతో దానికి సంబంధించిన అన్ని విషయాలు పూర్తి చేశారు. మొత్తం లిస్టు ఆయన దగ్గరే ఉంది. ఎవరికి ఉద్వాసన పలుకుతున్నారు? ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారనే విషయాలపై ఎవరికి తెలియడం లేదు. దీంతో అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పదవులు కోల్పోయిన వారికి పార్టీ పదవులు కట్టబెడతామని జగన్ భావిస్తున్నారు. జిల్లా ఇన్ చార్జిలుగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అధినేత నిర్ణయమే మాకు శిరోధార్యమని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ దాదాపు కొలిక్కి వచ్చినట్లే. ఆశావహులు కూడా జగన్ చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై ఎవరికి కూడా ఇంతవరకు సమాచారం లేదని తెలుస్తోంది.
Also Read: Swiggy And Zomato Services: స్విగ్గీ, జొమాటో సేవల్లో అంతరాయం.. ఇబ్బందుల్లో వినియోగదారులు
ఆఖరి సమయంలోనే ఎవరి పేర్లు ఉన్నాయో తెలియనుంది. కేబినెట్ విస్తరణ కోసం అందరిచేత రాజీనామాలు చేయించాలని చూస్తున్నారు. ఇదే అంశాన్ని గవర్నర్ తోనూ చర్చించారు. ఎన్నిక కానున్న మంత్రులతో ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావించారు. మంత్రివర్గ విస్తరణలో జగన్ తనదైన ముద్ర వేసి మంత్రిమండలిని కూర్చనున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే విషయంపై ఎవరికి కూడా సమాచారం మాత్రం లేదు.
గురువారం సాయంత్రం ప్రస్తుత కేబినెట్ చివరిసారిగా సమావేశం కానుంది. ఇందులోనే అందరి చేత రాజీనామాలు చేయించి కొత్త వారి లిస్టును గవర్నర్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మంత్రులు అందరు మాజీలు కానున్నారు. ఇన్నాళ్లు మంత్రి హోదాలో తిరిగిన వారికి పదవులు దూరం కావడం ఇష్టం లేకపోయినా పార్టీ నిర్ణయాల దృష్ట్యా వారు తమ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. లోపల మాత్రం అసంతృప్తి అలాగే ఉంటుందని తెలుస్తోంది. కానీ పార్టీ పదవులు చేపట్టినా మంత్రి హోదా ఉంటుందనే అనే వాదనలు సైతం వస్తున్నాయి.
Also Read:CM KCR- Governor Tamilisai: ఢిల్లీకి చేరిన సీఎం, గవర్నర్ పంచాయితీ?