ఓవైపు కరోనా.. మరోవైపు వానలు.. దేనికి సంకేతం?

కరోనా విజృంభిస్తున్న వేళ దేశంలో ఎడతెరపి లేకుండా వానలు కురిస్తున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షాలు పడుతున్నాయి. ఆగస్టులో కరోనా విజృంభిస్తుందని డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం హెచ్చరిస్తుందని ప్రకటించినా.. ప్రతీఒక్కరు లైట్ తీసుకున్నారు. ప్రభుత్వాలు లాక్డౌన్ ఎత్తివేయడంతో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని ప్రభుత్వాలు చెబుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలు కన్పించడం లేదు. దీంతో ప్రకృతే రంగంలోకి దిగినట్లు కన్పిస్తోంది. గడిచిన కొన్ని దశాబ్దలుగా […]

Written By: Neelambaram, Updated On : August 17, 2020 11:04 am
Follow us on

కరోనా విజృంభిస్తున్న వేళ దేశంలో ఎడతెరపి లేకుండా వానలు కురిస్తున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షాలు పడుతున్నాయి. ఆగస్టులో కరోనా విజృంభిస్తుందని డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం హెచ్చరిస్తుందని ప్రకటించినా.. ప్రతీఒక్కరు లైట్ తీసుకున్నారు. ప్రభుత్వాలు లాక్డౌన్ ఎత్తివేయడంతో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని ప్రభుత్వాలు చెబుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలు కన్పించడం లేదు. దీంతో ప్రకృతే రంగంలోకి దిగినట్లు కన్పిస్తోంది.

గడిచిన కొన్ని దశాబ్దలుగా చూసుకుంటే వర్షాలు రోజుల తరబడి కురిసిన సంఘటనలు చాలా అరుదుగా కన్పిస్తాయి. మన తాతలు చెబుతుంటే వాళ్లు.. వాళ్ల చిన్నతననంలో వర్షాలు కొడితే ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఎడతెరపి లేకుండా కొట్టేవని. వరుసగా 15రోజులు వర్షాలు పడేవని.. మన కాలంలో మాత్రం వర్షాలు గంటో.. రెండుగంటలు కొట్టి వెళ్లిపోవడం చూస్తున్నాం.. ఓవైపు ఎండకొడుతూనే.. మరోవైపు వర్షాలు పడటం చూసిన రోజులు అనేకం ఉన్నాయి. కానీ గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఆగస్టులో కరోనా విజృంభిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు, డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు చెబుతున్నా ఎవరూ పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నాయి. దీంతో పాజిటివ్ కేసులు సంఖ్య రోజుకు వేలల్లో నమోదవుతున్నాయి. గత నాలుగు నెలలుగా ప్రభుత్వాలు చెబుతున్నా పట్టించుకోని ప్రజలు ప్రస్తుతం ఇంటికి పరిమితం కావాల్సి వస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అత్యవసర పనులు సరే బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణలో కేసీఆర్ పుణ్యమా అని చెరువులు నిండిపోయి జలకళను సంతరించుకున్నాయి. అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో చెరువులు పొంగిపోయి జనాసావాల్లోకి చేరుతున్నాయి. వరద ప్రవహం ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి తగు చర్యలు చేపడుతోంది. అయితే వరదలు ఎక్కువ అవుతుండటంతో సహాయ చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి. రష్యా వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చిన ఇప్పట్లో అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక కరోనా నగరాల నుంచి పల్లెలకు పాకింది. దీంతో కరోనా కట్టడి మరింత కష్టంగా మారింది.

ప్రభుత్వాలు లాక్డౌన్ ఎత్తేయడంతో ప్రజలు బయట తిరుగుతున్నాయి. అయితే గడిచిన నాలుగైదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు ప్రజలను ఇళ్లకే పరిమితం చేశాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రకృతే ఇలా వానల రూపంలో వచ్చిందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. కరోనా విజృంభణ.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు చూస్తుంటే ఇదంతా ప్రకృతి ఆడే నాటకంలా కన్పిస్తుంది. కరోనా నుంచి కాపాడేందుకే ప్రకృతి లాక్డౌన్ విధించిందా? లేదా అన్నది పక్కకు పెడితే.. ప్రకృతి లాక్డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఓవైపు కరోనా.. మరోవైపు ఎడతెరపి లేని వానలతో ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు.