https://oktelugu.com/

పది లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగుల్లో పది లక్షల మంది ఇంటినుంచే పనిచేసే అవకాశాలున్నాయని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్‌ గోపాలకృష్ణన్‌ భావిస్తున్నారు. అయితే, కరోనా వైరస్‌తో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఐటీ రంగ సంస్థలు భవిష్యత్తులో ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే అవకాశాలు మెండుగావున్నాయని చెప్పారు. కానీ, ఇదే సమయంలో ఉద్యోగుల తొలగింపు భారీ స్థాయిలో ఉండకపోవచ్చునని భరోసా వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టి సానుకూల పరిస్థితులు నెలకొన్న […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 28, 2020 / 12:28 PM IST
    Follow us on


    లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగుల్లో పది లక్షల మంది ఇంటినుంచే పనిచేసే అవకాశాలున్నాయని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్‌ గోపాలకృష్ణన్‌ భావిస్తున్నారు. అయితే, కరోనా వైరస్‌తో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఐటీ రంగ సంస్థలు భవిష్యత్తులో ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే అవకాశాలు మెండుగావున్నాయని చెప్పారు. కానీ, ఇదే సమయంలో ఉద్యోగుల తొలగింపు భారీ స్థాయిలో ఉండకపోవచ్చునని భరోసా వ్యక్తం చేస్తున్నారు.

    కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టి సానుకూల పరిస్థితులు నెలకొన్న తర్వాత ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ప్రాధాన్యతనిచ్చే అవకాశాలున్నాయని, ఇంటినుంచి పనిచేయడానికి అలవాటు పడిన వారు కార్యాలయాలకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని చెప్పారు. ఇప్పటికే చాలా మంది ఇంటినుంచి పనిచేయడానికి టెక్నాలజీ పరంగా ఎన్నో చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

    కానీ అందుకోసం క్లయింట్ల అనుమతితో బిజినెస్‌ ప్రాసెసింగ్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన ఆయన భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నవారిలో 90 నుంచి 95 శాతం వరకు ఉద్యోగులు ఇంటినుంచి పనిచేస్తున్నారని, పని కూడా వేగవంతంగా పూర్తవుతుండటంతో భవిష్యత్తులో కూడా ఇదే తీరును కొనసాగించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

    ఇంటి నుంచి పనిచేయనుండటంతో చిన్న స్థాయి స్టార్టప్‌లకు భారీ ప్రయోజనం చేకూరనున్నదని తెలిపారు. ఆఫీస్‌ ఉండాల్సిన అవసరం లేకపోవడంతో నిర్వహణ ఖర్చులు తగ్గి ఆర్థిక ప్రయోజనం కూడా చేకూరనున్నదని చెప్పారు. సానుకూల పరిస్థితులు నెలకొన్నతర్వాత సంస్థలు ఆఫీస్‌ స్థలాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారని, దీంతో ఖర్చులు తగ్గనుండటం ఆయా సంస్థలకు ఆర్థికంగా లాభం చేకూరనున్నదని ఆయన చెప్పారు.
    లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా 20 నుంచి 30 శాతంవరకు ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయడానికి మొగ్గుచూపుతారని చెబుతూ ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే భవిష్యత్తులోనూ రన్‌ చేయవచ్చునని, నియామకాలు చేపట్టే అవకాశాలు లేవని ఆయన స్పష్టంచేశారు.