https://oktelugu.com/

‘కరోనా’పై ట్యూషన్ పెట్టించుకోండి..!

అజ్ఞానం, మూర్ఖత్వం ఆవహించిన టీడీపీ నాయకులు ఏమి మతాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. మీళ్ళంతా చంద్రబాబు హయాంలో మంత్రులై మేధావులమని బిల్డప్ ఇచ్చేవారని ట్విట్ చేశారు. కరోనాపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. టెస్టులు ఎక్కువ చేసి చూపించడమేంటని ప్రశ్నించారు. వ్యాధి విస్తరణకు ప్రభుత్వం కారణమవడమేంటంటూ కరోనా వైరస్ పై అవగాహన పెంచుకునేందుకు ట్యూషన్ పెట్టించుకోవాలని టిడిపి నాయకులకు సూచించారు. వరదలొస్తాయని ముందుగా […]

Written By: , Updated On : April 28, 2020 / 12:18 PM IST
Follow us on


అజ్ఞానం, మూర్ఖత్వం ఆవహించిన టీడీపీ నాయకులు ఏమి మతాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. మీళ్ళంతా చంద్రబాబు హయాంలో మంత్రులై మేధావులమని బిల్డప్ ఇచ్చేవారని ట్విట్ చేశారు. కరోనాపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు.

టెస్టులు ఎక్కువ చేసి చూపించడమేంటని ప్రశ్నించారు. వ్యాధి విస్తరణకు ప్రభుత్వం కారణమవడమేంటంటూ కరోనా వైరస్ పై అవగాహన పెంచుకునేందుకు ట్యూషన్ పెట్టించుకోవాలని టిడిపి నాయకులకు సూచించారు.

వరదలొస్తాయని ముందుగా సమాచారం ఉన్నప్పుడు ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని, సకాలంలో స్పందించక పోతే ప్రభుత్వాన్ని తప్పు పట్టాలన్నారు. కరోనా విషయంలో కూడా యనమల, కళా లాంటి కాలం చెల్లిన మేధావులు ‘వరద ముంపు’ తరహా విమర్శలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు.