https://oktelugu.com/

విశాఖ గ్యాస్ లీకేజీపై విచారం వ్యక్తం చేసిన టాలీవుడ్

విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తించింది. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన ప్రమాదకర స్టైరీస్ గ్యాస్ దుర్ఘటనతో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలను కొల్పోయారు. వేలాది మంది అనారోగ్యంపాలై ఆసుప్రతుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై టాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనలో బాధితులైన వారంతా తిరిగి త్వరగా కోలువాలనే ఆకాంక్షను సెలబ్రెటీలు వ్యక్తం చేశారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, […]

Written By: , Updated On : May 7, 2020 / 04:22 PM IST
Follow us on


విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తించింది. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన ప్రమాదకర స్టైరీస్ గ్యాస్ దుర్ఘటనతో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలను కొల్పోయారు. వేలాది మంది అనారోగ్యంపాలై ఆసుప్రతుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై టాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనలో బాధితులైన వారంతా తిరిగి త్వరగా కోలువాలనే ఆకాంక్షను సెలబ్రెటీలు వ్యక్తం చేశారు.

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు రాజమౌళి, మెగాపవర్ స్టార్ రాంచరణ్ తదితరులు స్పందించారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నత్వరగా కోలువాలంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనలో తమ బంధువులను కోల్పోయినవారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన దృశ్యాలు కలిచి వేస్తున్నాయని మెగా పవర్ స్టార్ రాంచరణ్ అన్నారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించినట్లు ట్వీట్ చేశారు. వీరితోపాటు హీరో రవితేజ, రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్, నాని, అఖిల్ అక్కినేని, కొరటాల శివ, అల్లు శిరీష్, సునీల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, ఈషా రెబ్బా, నిధి అగర్వాల్, ప్రణీత, శ్రీముఖి తదితరులు ఈ దుర్ఘటనపై ట్వీటర్లో విచారం వ్యక్తం చేశారు.