Pawan Kalyan: గత ఎన్నికల్లో జగన్ గెలుపునకు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఒక కారణమైతే.. ’ఒక్క చాన్స్‘ అన్న నినాదం కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. ఒక్క అవకాశం అన్న స్లోగన్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీకే టీమ్ సక్సెస్ అయ్యింది. ఇంతలా వేడుకుంటున్నాడు ఒక్క చాన్సిస్తే పోలే అంటూ అన్నివర్గాల ప్రజలు ఒక డిసైడ్ కి రావడంతో జగన్ సీఎం పీఠాన్ని సునాయాసంగా అందుకోగలిగారు. అయితే ఒక చాన్స్ ఇచ్చి చేజేతులా చేతులు కాల్చుకున్నామని బాధపడడం ఇప్పుడు ప్రజల వంతైంది. రాష్ట్ర అభివృద్ధి 20 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్లిపోయిందని విద్యాధికులు, మేథావులు బాధపడుతున్నారు. అయితే ఒకే ఒక చాన్స్ ను కూడా జగన్ బాగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. బాగా పాలించి రెండో చాన్స్ అడగడానికి వీలు లేకుండా చేసుకున్నారు.

అయితే పవన్ నోటి నుంచి ఒక చాన్స్ అన్న మాట ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ పవన్ అడుగతుంది తన రాజకీయ వాంఛ కోసంకాదు. ఈ రాష్ట్ర ఇబ్బందుల నుంచి అధిగమించడానికి తనకు ఒక చాన్స్ ఇవ్వాలన్న కొత్త నినాదంతో పవన్ ముందుకొస్తుండడంతో అన్ని వర్గాల ప్రజల్లో ఒక రకమైన ఆలోచన అయితే ప్రారంభమైంది. పవన్ నుంచి వచ్చిన ఒక్క చాన్స్ రిక్వస్ట్ అటు అధికార పార్టీ వైసీపీకి, ఇటు ప్రధాన విపక్షం టీడీపీ మింగుడుపడడం లేదు.ఎందుకంటే జగన్ రెండో చాన్స్ కోసం వెయిట్ చేస్తుండగా.. 40 ఈయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని కలలు గంటున్నారు.
2024 లో జనసేన కి ఒక్క అవకాశం ఇవ్వండి.#APNeedsPawankalyan #janasena #PAWANvsJAGAN #JaganannaMosam pic.twitter.com/2wM5YTNVZV
— Swapna Naidu JSP 🚩 (@SwapnaNaaidu) November 13, 2022
ఎన్నికలు సమీపిస్తుండడంతో దూకుడు పెంచిన పవన్ ..ఈసారి ఎలాగైన అధికారాన్ని అందుకోవాలని భావిస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇటీవల మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘ఒక్క చాన్స్ నా కోసం కాదు.. మీ భవిష్యత్ కోసం… మీ బిడ్డల భవిష్యత్ కోసం..అవినీతి రహిత ప్రభుత్వం.. పాలన ఎలా ఉంటుందో చూపిస్తా’ అన్నదే ఆ వీడియో సారాంశం. దీనిని ఇప్పుడు జనసైనికులు, అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇది ఆహ్వానించదగ్గదే అంటూ బీజేపీ నేత విష్ణువర్థన్ తన ట్విట్టర్ లో కామెంట్స్ పెట్టారు. అయితే మెజార్టీ వర్గాలు సైతం పవన్ ది సహేతుకమైన కోరిక అంటూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

అయితే దీనిపై ఎలా స్పందించాలో వైసీపీ, టీడీపీ శ్రేణులకు తెలియడం లేదు. ఎందుకంటే తమ నేత జగన్ ఇదే నినాదంతో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారని వైసీపీ శ్రేణులకు తెలుసు. అటు పాలనా వైఫల్యాలు కూడా వారికి ఎరుకే. ఎలా చాన్సిస్తారని ప్రశ్నిస్తే.. అప్పట్లో జగన్ కి ఇచ్చినట్టే అన్న సమాధానం వస్తుంది. అందుకే ఎందుకొచ్చింది ఈ గొడవ అంటూ వైసీపీ అభిమానులెవరూ కామెంట్స్ పెట్టడం లేదు. ఇక టీడీపీ శ్రేణులైతే ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. చంద్రబాబును తప్పించి వారు సీఎంగా చూసేందుకు ఇష్టపడరు. అలాగని పవన్ ను వ్యతిరేకిస్తే రెండు పార్టీల మధ్య ఉన్న వాతావరణం చెడిపోతుందని భయపడుతున్నారు. అందుకే అచీతూచీ వ్యవహరిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని తటస్థులు మాత్రం పవన్ నుంచి వచ్చిన ఒక్క చాన్స్ ఆహ్వానించదగ్గదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే పవన్ తాజా స్లోగన్ వర్కవుట్ అవుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తప్పుకుండా ప్రజలు చాన్సిస్తారని నమ్ముతున్నారు.