ఏపీలో మరోసారి మద్యం బంద్..!

మద్యం విక్రయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట డిగజారే పరిస్థితి నెలకొంది. ఏపీలో మద్యం దుకాణాలు ఏ సమయంలో తెరిచినా దుకాణాల వద్ద జనం పోటెత్తున్నారు. భౌతిక దూరాన్ని అస్సలు పాటించడం లేదు. ఒక్కోషాపు ముందు వందల మంది నిలబడుతున్నారు. దీంతో.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు షాపులు మూసేయాలని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాలు పోతాయని 86 శాతం భారతీయుల భయం! ఇప్పటికే మద్యం ధరలను భారీగా పెంచిన ప్రభుత్వం చర్యలు ఫలితాన్ని […]

Written By: Neelambaram, Updated On : May 6, 2020 2:03 pm
Follow us on


మద్యం విక్రయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట డిగజారే పరిస్థితి నెలకొంది. ఏపీలో మద్యం దుకాణాలు ఏ సమయంలో తెరిచినా దుకాణాల వద్ద జనం పోటెత్తున్నారు. భౌతిక దూరాన్ని అస్సలు పాటించడం లేదు. ఒక్కోషాపు ముందు వందల మంది నిలబడుతున్నారు. దీంతో.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు షాపులు మూసేయాలని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉద్యోగాలు పోతాయని 86 శాతం భారతీయుల భయం!

ఇప్పటికే మద్యం ధరలను భారీగా పెంచిన ప్రభుత్వం చర్యలు ఫలితాన్ని ఇవ్వలేదు. దీనికితోడు మందు అమ్ముతూ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కరోనాకు బలిపెడుతోందని ఆరోపణలు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలి రోజు 25 శాతం రేట్లు పెంచినా జనం బారులు తీరగా రెండవ రోజు మరో 50 ధర పెంచినా మందు బాబులు లెక్క చేయలేదు. మద్యం ధరలు పెంచినంతా మాత్రాన రద్దీ తగ్గేదిలేదని గ్రహించిన ప్రభుత్వం ఆలోచనలో పడింది. రేషన్ పంపిణీకి అవలంభించిన విధంగా టోకెన్ ఇచ్చి ఆ సమయానికి మద్యం దుకాణం వద్దకు వచ్చి సరుకు పట్టుకెళ్లే విధానాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ లో చేదు వార్త!

మరోవైపు దీనికోసం ఆన్ లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే విషయాన్ని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరాన్ని పాటించడానికి ప్రస్తుతం తీసుకున్న చర్యలు ఫలితాన్ని ఇవ్వకపోవడంతో భవిష్యత్ లో ఎం చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల పనులు లేకపోవడంతో ఇప్పటికే ప్రజలు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారని, కూలీనాలీ చేసుకునే జనం మద్యం దుకాణాలకు డబ్బులు తీసుకుని రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. పింఛన్ డబ్బులను, సంక్షేమ పథకాల కింద ఇచ్చే రుణాలు, ఇతర ఆర్థిక సాయాన్ని కొందరు ఇలా మందుకు తగలేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నారు. గత రెండు రోజులగా మద్యం వల్ల కొన్ని సంఘటనలలో రాష్ట్రంలో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరి కొందరు గాయాల పాలయ్యారు.