
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఏపీ ప్రభుత్వం మధ్య నడుస్తున్న వార్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వంతో ఢీకొట్టిన ఆయన.. మరో సారి గిల్లి కయ్యం పెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని ఓ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేస్తే.. ఈ అధికారి మాత్రం ఎన్నికలు రెడీ అయిపోతున్నారు.
Also Read: చెరువు కింద బిక్కు బిక్కు.. భయం భయంగా హైదరాబాదీలు
అందులో భాగంగా ఈనెల 28న ఆయన అన్ని పార్టీల నేతలతో సమావేశం కాబోతున్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకొని నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన హైకోర్టులో వేసిన అదనపు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌కు సంబంధించిన విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్‌లో ఉంది. ఆ తీర్పు రాగానే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించవచ్చని తెలుస్తోంది.
గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కానీ.. కరోనా కారణంగా అది సాధ్యపడలేదు. దాడులు, దౌర్జన్యాలతో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకోవాలని చూస్తున్నారని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర బలగాల రక్షణ కావాలని కోరారు. దీంతో ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సాయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ ఉన్న ప్రక్రియను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
Also Read: చంద్రబాబు సైడ్.. చినబాబుకే స్టీరింగ్..
ఇప్పుడు కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆ విషయం ఎస్‌ఈసీకి చెప్పాలని హైకోర్టు సూచించింది. దీని ప్రకారం చూస్తే ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ ఉన్నంత కాలం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సానుకూలంగా ఉండే అవకాశం లేదు. కానీ నిమ్మగడ్డ మాత్రం తన పదవీ కాలం పూర్తయ్యే లోపు అంటే మార్చిలోపు ఎన్నికలు పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టుకునే చాన్స్ ఉంది. మొత్తంగా చూస్తే మరోసారి ఏపీలో ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ పంచాయితీ మరో మొదలైనట్లే అని అనిపిస్తోంది.