Happy Birthday YS Jagan : తమ అధినేత పై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ జన్మదిన వేడుకలను ఊరూవాడ ఘనంగా జరుపుకున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కలు నాటారు. చివరకు రక్తదానం చేశారు. ఎన్నడూ లేని విధంగా జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు ప్రభుత్వం ముందుగానే పిలుపునిచ్చింది. జగన్ 50 వ జన్మదినం కావడంతో స్వర్ణోత్సవ వేడుకలు పేరిట సాంస్కృతిక శాఖ ముందుగానే కార్యక్రమాలను ఏర్పాటుచేసింది ఇందుకు రూ.2 కోట్లు మంజూరుచేసింది. మంత్రి ఆర్కే రోజా కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ఆమె నర్తకిగా మారి మరీ జగన్ జన్మదిన వేడుకలుఅంబరాన్ని తాకేలా చేశారు. కవులు, కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలను సైతం రూపొందించారు. కానీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జన్మదిన వేడుకలు మాత్రం అంబరాన్ని తాకాయి. అధినేత గ్రాఫ్ పెంచేలా వైఎస్సార్ సీపీ శ్రేణులు ఏర్పాటుచేసిన కార్యక్రమాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.
సీఎం జన్మదిన వేడుకల్లో రక్తదానం చేయదలచుకున్న వారికి ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించారు. వారం కిందట ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. ఇందులో పేర్లు నమోదుచేసుకొని రక్తదానం చేయాలని పిలుపినివ్వడంతో వేలాది మంది స్పందించారు. ఇటు పార్టీ అభిమానులే అధికం. అయితే సంక్షేమ పథకాల లబ్ధిదారులు, విద్యార్థులు రక్తదానం చేసేలా వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చినట్టు ప్రచారం సాగింది. వలంటీర్లు బలవంతం చేసినట్టు వార్తలు వచ్చాయి. కొంతమందికిఇష్టం లేకున్నా పేర్లు నమోదు చేయించారన్న విమర్శలున్నాయి.
అయితే ఇవేవీ అడ్డంకి కాలేదు. వైఎస్సార్ సీపీ నాయకులు భావిస్తున్నట్టు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ సక్సెస్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జగన్ జన్మదిన వేడుకలతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 34,723 యూనిట్ల బ్లెడ్ ను సేకరించగలిగారు. అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. గతంలో 10,500 యూనిట్ల రక్తసేకరణ రికార్డును కొల్లగొట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద రక్తదాన శిబిరంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులుగుర్తించారు. అదే విషయాన్ని ప్రకటించారు. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తమ అధినేత పుట్టిన రోజు నాడు ఒక రికార్డు నెలకొల్పామని చెబుతున్నారు.