Omicron: ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత వేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని చుట్టేసే వీలుందని తెలుస్తోంది. ఐరోపా దేశాల్లో మెరుపు వేగంతో వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో కరోనా కొత్త పుంతలు తొక్కుతూ ప్రజలను మరింత బాధించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఒమిక్రాన్ వేరియంట్ తో మునుముందు మరిన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఒమిక్రాన్ తీవ్రత మరీ ఎక్కువా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేయించాలని ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలను ముప్పతిప్పలు పెట్టేందుకు మరింత ప్రమాదకారిగా మారే ప్రమాదముందని వైద్యులు సూచిస్తున్నారు.
శీతాకాలం కావడంతో వ్యాధి తీవ్రత పెరుగుతోందనే వాదన ఉంది. గత జనవరిలో డెల్టా వేరియంట్ ఉక్కిరిబిక్కిరి చేసింది. కానీ ఒమిక్రాన్ ఉధృతితో ఆందోళన పెరుగుతోంది. టీకాలు తీసుకోని వారికి ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ఐరోపా దేశాల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా విస్తరిస్తోంది. దీంతో మనదేశంలో కూడా ఒమిక్రాన్ ఉధృతి పెరుగుతుండటంపై ఆందోళన కలిగిస్తోంది.
Also Read: Omicron in India: దేశాన్ని ఒమిక్రాన్ వైరస్ కమ్మేస్తోందా? 3వ వేవ్ తప్పదా?
ఒమిక్రాన్ తీవ్రత పెరగడంతో ప్రపంచం యావత్తు నివ్వెరపోతోంది. అన్ని దేశాల మధ్య ప్రయాణాలు రద్దు చేస్తేనే తప్ప ఒమిక్రాన్ విస్తరణ ఆగేలా కనిపించడం లేదు. ఒమిక్రాన్ తో పెద్ద ముప్పు అనేది లేదని వైద్యులు చెబుతున్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు అన్ని సిద్ధంగా ఉంచామని చెబుతున్నా ప్రజలకు మాత్రం భయం మాత్రం వీడటం లేదు. ఈ క్రమంలో ఒమిక్రాన్ ను ఎంత వరకు ఎదుర్కొని నిలుస్తామో తెలియాల్సి ఉంది.
Also Read: Marriage Age: అమ్మాయిల వివాహ వయసు పెంచితే సరిపోతుందా.. పోషకాహార లోపాన్ని అరికట్టొద్దా..?