https://oktelugu.com/

Raashi Khanna: 8ఏళ్ల తర్వాత బాలీవుడ్​లోకి రీ ఏంట్రీ.. అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రాశీఖన్నా

Raashi Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. మొదటి సినిమా తోనే ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. ఆ తరవాత వచ్చిన ‘జిల్’ సినిమాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చి యువకుల హృదయాల్ని కొల్లగొట్టింది. టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా దున్నేస్తున్న ఈ భామ, వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా తమిళంలో అరడజనుకు పైగా చిత్రాల వరకు చేస్తుంది. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తర్వాత […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 04:44 PM IST
    Follow us on

    Raashi Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. మొదటి సినిమా తోనే ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. ఆ తరవాత వచ్చిన ‘జిల్’ సినిమాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చి యువకుల హృదయాల్ని కొల్లగొట్టింది. టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా దున్నేస్తున్న ఈ భామ, వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా తమిళంలో అరడజనుకు పైగా చిత్రాల వరకు చేస్తుంది. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తర్వాత టాలీవుడ్ లో చిన్న గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్ళీ పలు సినిమాలతో బిజీ అవుతుంది.

    Rashi Khanna

    మరోవైపు బాలీవుడ్​లోనూ ఫుల్​ షెడ్యూల్​ వేసుకుంది ఈ బ్యూటీ. తాజాగా, తను నటించనున్న బాలీవుడ్​ సినిమా నుంచి క్రేజీ అప్​డేట్​ వచ్చింది. ధర్మ ప్రొడక్షన్స్​లో కరణ్ జోహార్​ నిర్మిస్తున్న యోధ సినిమాలో రాశీ ఖన్నా కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపింది. దిశా పటానీతో కలిసి యోధా టీమ్​లో తానూ చేరనున్నట్లు స్వయంగా రాశీ ఖన్నా సోషల్​మీడియా వేదికగా తెలియజేసింది. ఈ క్రమంలోనే సినిమా లోగోను షేర్​ చేసింది.

    Also Read: ప్చ్ క్రేజీ బ్యూటీ… అంతా పడిపోయాక తత్వం బోధపడితే ఎలా ?

    గతంలో 2013లో జాన్​ అబ్రహం నటించిన మద్రాస్​ కేఫ్​ సినిమాతో బాలీవుడ్​లో అడుగుపెట్టింది రాశీ. మళ్లీ 8ఏళ్ల తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది నవంబరు 11న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో సిద్ధార్థ్​ మల్హోత్రా హీరోగా నటించనున్నారు. గతనెలలోనే షూటింగ్​ ప్రారంభించిన చిత్రబృందం.. అందుకు సంబంధించిన గ్లింప్స్​ను సోషల్​మీడియాలో షేర్​ చేశారు. ఈ సినిమాకు సాగ్ అంబ్రే, పుష్కర్​ ఓజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేని ఈ భామ.. ఇప్పుడు బాలీవుడ్​లో తన మార్క్​ను క్రియేట్​ చేయాలని చూస్తోంది.

    Also Read: బాలయ్య కోసం లుక్ మార్చబోతున్న శ్రుతి హాసన్ !