Omicron Effect: కరోనా ప్రభావంతో పండుగలపై ఆంక్షలు విధిస్తున్నారు. త్వరలో జరుపుకునే క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడులకలకు కరోనా భంగపాటు కానుంది. సంతోషంగా జరుపుకోవాలని ప్రజల ఆకాంక్షలు సన్నగిళ్లుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు పరంపర కొనసాగుతోంది. కర్ణాటక ప్రభుత్వం డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు ఎలాంటి బహిరంగ పార్టీలు, వేడుకలు నిర్వహించకూడదని అల్టిమేటం జారీ చేసింది. దీంతో నూతన సంవత్సర వేడుకలపై ప్రభావం పడనుంది.

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. సామూహిక వేడుకలకు అనుమతులు నిరాకరించిన సందర్భంలో ప్రజలు నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నందున ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
నిపుణుల సిఫార్సుల మేరకే ఆంక్షలు విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటిస్తోంది. డీజీల వినియోగంపై నిషేధం విధించారు. ఎక్కడ కూడా డీజేలు వినియోగిస్తే చట్టపరంగా శిక్షార్హులవుతారని చెబుతున్నారు. పబ్బులు, రెస్టారెంట్లు కొద్ది మందితో వేడుకలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కానీ ఎక్కువ మంది గుమిగూడితే అనర్థాలు కలుగుతాయని చెబుతోంది.
Also Read: Yogi Adityanath: కోటి మంది ఓట్లు కొల్లగొట్టే యూపీ సీఎం యోగి ప్లాన్ ఇదీ
మరోవైపు విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి లక్షణాలుంటే ఐసోలేషన్ కు తరలిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో దాదాపు 200 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్నారు. వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: S 400 missile: భారత్ అష్టదిగ్భంధనం: చైనా, పాక్ వెన్నులో వణుకు