Omicron: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పెరుగుతోంది. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో వచ్చిన వైరస్ ల కంటే రెండో దశలో వచ్చిన డెల్టా వేరియంట్ తో జరిగిన నష్టం తెలిసిందే. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ తో కూడా ప్రమాదకరమే అని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది.

దక్షిణాఫ్రికాలో వెలుగు చేసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీంతో బ్రిటన్ కూడా వణుకుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం బ్రిటన్ లో తీవ్ర ప్రభావం చూపుతోంది.
గత 24 గంటల్లోనే 90 వేల కరోనా కేసులు నమోదవగా అందులో పదివేలు ఒమిక్రాన్ వేరియంట్ వే ఉండటం గమనార్హం. దీంతో ప్రపంచమే నివ్వెరపోతోంది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తూ ప్రజలను ఆందోళనలకు గురిచేస్తోంది. బ్రిటన్ లో ఇప్పటికే ఏడు మరణాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: Phone Tapping: ఎన్నికల వేళ యోగి సర్కార్ మరో దుమారం.. ఫోన్ ట్యాపింగ్ లో బుక్?
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తీవ్రమైనందున చాలా దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాయి. లాక్ డౌన్ దిశగా కూడా కొన్ని దేశాలు అడుగులు వేస్తున్నాయి. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మాస్కులు ధిరిస్తూ భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. మూడో దశ ముప్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శాస్ర్తవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒక వేళ మూడో దశ వస్తే తట్టుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Omicron: ప్రపంచాన్నే చుట్టేస్తున్న ఒమిక్రాన్.. ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన