Homeజాతీయ వార్తలుElon Musk : ఓ ఎలన్ మస్కూ.. ఎన్ని దుకాణాలు తెరుస్తావు స్వామీ.. ఎన్ని విత్తనాలు...

Elon Musk : ఓ ఎలన్ మస్కూ.. ఎన్ని దుకాణాలు తెరుస్తావు స్వామీ.. ఎన్ని విత్తనాలు వేసావూ!

Elon Musk : ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా సరే అది ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఆయన మాజీ పర్సనల్ ఇష్యూస్ అయితే ప్రతి ఒక్కరికీ మరింత ఆసక్తిగా ఉంటుంది. ఈ క్రమంలో మస్క్ తన పెళ్లిళ్లు పిల్లలకు సంబంధించిన విషయం మరో సారి వైరల్ అవుతుంది. అపర కుబేరుడు అయినప్పటికీ ఎలాన్ మస్క్ వైవాహిక జీవితంలో చాలా కుదుపులే ఉన్నాయి. మస్క్ ఇప్పటివరకూ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. వాటిలో ఏ ఒక్క పెళ్లి కూడా నిలవలేదు. మ్యారేజ్ చేసుకున్న భార్యలతోనూ ఆయన అధికారికంగా విడిపోయారు.

ఎలాన్ మస్క్ గత కొన్ని రోజులుగా తన ప్రాజెక్టులు, పదవులతోనే కాకుండా తన వ్యక్తిగత జీవితం విషయంలో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ఎలోన్ మస్క్ 12వ సారి బిడ్డకు తండ్రి అయ్యాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తను ఎలోన్ మస్క్ సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తరువాత ఎలోన్ మస్క్ స్వయంగా ఆ బిడ్డ గురించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచడం తప్పు అని అన్నారు. దీని గురించి పత్రికా ప్రకటన జారీ చేశారు. ఇప్పుడు ప్రజలు అతని వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని గూగుల్ ను ఆశ్రయిస్తారు. అసలు మనోడికి ఎంత మంది భార్యలు, ఇంకెంత మంది పిల్లలు ఉన్నారో అని ఆరా తీస్తున్నారు. అసలు ఇప్పటికే 12మంది పిల్లలను కన్న ఎలాన్ మస్క్.. ఇంకెన్ని చోట్ల విత్తనాలు నాటాడని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నాడు.

ఇందుకు కారణం లేకపోలేదు. తాజాగా ఎలాన్ మస్క్‌తో కలిసి తాను ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు రచయిత్రి ఆష్లే సెయింట్ క్లైర్ ఆరోపించారు. ఆ బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని ఆమె ప్రకటించారు. తమ చిన్నారి గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని ఆమె వేడుకున్నారు. తన బిడ్డను సురక్షితంగా పెంచేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. కాగా దీనిపై ఎలాన్ మస్క్ ఇంకా స్పందించలేదు.

అసలు ఎంతమంది భార్యలు ఉన్నారు?
ఎలోన్ మస్క్ 2000 సంవత్సరం నుండి మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నాడు. వారికి అనేకసార్లు విడాకులు ఇచ్చాడు. అతను ఒక మహిళలను రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు రెండుసార్లు విడాకులు ఇచ్చాడు. ఇప్పటివరకు అతనికి నలుగురు భార్యలు ఉన్నారు. వారిలో ముగ్గురికి విడాకులు ఇచ్చాడు. అతను ప్రస్తుతం తన బ్రెయిన్ ఇంప్లాంట్ సంస్థ న్యూరాలింక్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్న శివోన్ జిలిస్‌తో కలిసి ఉంటున్నాడు.

మొదటి భార్య – జస్టిన్ విల్సన్
ఎలోన్ మస్క్ మొదట 2000 సంవత్సరంలో విల్సన్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. మొదట వారికి నెవాడా అనే పాప పుట్టింది కానీ ఆమె 10 వారాలలోనే చనిపోయింది. దీని తరువాత, 2004 లో విల్సన్ కు గ్రిఫిన్, వివియన్ అనే కవల పిల్లలు పుట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత వివియన్ ఒక ట్రాన్స్‌జెండర్ గా మారిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీని తరువాత 2006లో ముగ్గురు పిల్లలు పుట్టారు.వారి పేర్లు కై, సాక్సన్, డామియన్. వారు IVF ద్వారా జన్మించారు. మస్క్ ఆమెకు 2008 సంవత్సరంలో విడాకులు ఇచ్చాడు.

రెండో భార్య – తలులా రిలే
ఆ సంవత్సరంలో ఎలోన్ మస్క్ తలులా రిలేను వివాహం చేసుకున్నాడు. కానీ, ఆమె 2012 సంవత్సరంలో అతనికి విడాకులు ఇచ్చింది. దీని తరువాత అతను ఆమెనే 2013 లో మళ్ళీ వివాహం చేసుకున్నాడు. 2016 లో మళ్ళీ విడాకులు తీసుకున్నాడు. రిలేతో మస్క్‌కు పిల్లలు లేరు.

మూడవ భార్య – గ్రిమ్స్
తర్వాత ఎలోన్ మస్క్ గ్రిమ్స్‌తో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఆమె ద్వారా మస్క్ కు 2020 లో ఒక కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత 2021లో, సరోగసీ ద్వారా ఒక కుమార్తె జన్మించింది, ఆమె పేరు ఎక్సా డార్క్ సైడెరెల్. దీని తరువాత మస్క్ 2021 సంవత్సరంలో గ్రిమ్స్ నుండి విడిపోయాడు. కానీ తరువాత వారికి టెక్నో మెకానియస్ అనే మరో బిడ్డ ఉన్నాడని తెలిసింది.

నాల్గవ భార్య – శివోన్ జిలిస్
ఆ తర్వాత 2021లో మస్క్, శివోన్ జిలిస్ లకు స్ట్రైడర్, అజూర్ అనే కవల పిల్లలు పుట్టారు. తాజా కొన్ని నెలల క్రితం 12వ సారి తండ్రి అయ్యాడు. ఈ విధంగా మస్క్ నలుగురు భార్యలతో 12మందిని కన్నారు. ఇది అఫీషియల్ నంబర్ మాత్రమే. ఇంకా అనఫిషియల్ గా ఎంత మంది ఉన్నారో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular