
దేశ వ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ ఈ నెల 14వరకు ముగియనుంది. కానీ దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పీఎం మోడీకి లాక్ డౌన్ పొందించాలని విజ్ఞప్తి చేశారు. దింతో ఈ నెల 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాక లాక్ డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించగా అంతకంటే ముందే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఏప్రిల్ 30వరకూ లాక్ డౌన్ పొడిగించారు.
రాష్ట్రంలో ఇప్పటికే మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఒడిశాలో ఇప్పటివరకూ 42 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారు. వాస్తవానికి ఈ నెల 14వరకూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంది. మిగతా రాష్ట్రాలు కూడా నవీన్ పట్నాయక్ బాటలో పయనించే అవకాశాలు కనపడుతున్నాయి