King Cobra: అదో అరుదైన పాము. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సర్పం. దాని నుంచి వింత శబ్దాలు వస్తాయి. దాని కూతలు ఓ రకంగా ఉంటాయి. వింటే ఏమిటో అర్థం కాకుండా ఉంటుంది. తాజాగా ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికంగా పురాతన బావిలో అకస్మాత్తుగా వింత శబ్దాలు రావడంతో గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు. ఏం ఉందో అని పరుగులు తీశారు. భయభ్రాంతులకు గురయ్యారు. నిరుపయోగంగా ఉన్న బావిలో నల్ల త్రాచు ఉందని తెలుసుకుని అవాక్కయ్యారు.

అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. బావిలో ఉన్న పన్నెండు అడుగుల పామును చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం దాన్ని మెల్లగా బయటకు తీశారు. తరువాత పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉందని గుర్తించారు. దీంతో అటవీ ప్రాంతంలో వదిలేశారు. పామును చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వచ్చారు.
పాము దాదాపు 6.7 మీటర్లు (22 అడుగులు) పొడవు ఉండటంతో ప్రజలు గుంపులుగా తరలి వచ్చి చూశారు. ఆఫ్రికా అరణ్యాలలో ఎక్కువగా కనిపించే కింగ్ కోబ్రా ను జనం ఎగబడి చూశారు. దీని విషయం అత్యంత ప్రమాకరమని తెలిసిందే. దీంతో అది కాటేస్తే మరణాల శాతం 75 వరకు ఉంటుందని చెబుతున్నారు.
Also Read: First Night: అక్కడ పిల్లతోపాటు.. తల్లి కూడా శోభనం గదిలోకి వెళ్లాల్సిందే..!
పాడు బడిన బావిలో పామును చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పామును చూసి ఆశ్చర్యపోయారు. అబ్బో ఎంత పెద్ద పాము అని భయాందోళన చెందారు. బావిలో ఉండటంతో ఎవరికి హాని జరగలేదు. అదే మైదాన ప్రాంతంలో ఉంటే ప్రజలకు ఇబ్బందులు ఏర్పడేవి అని తెలుస్తోంది.
Also Read: Nara Lokesh: మారిన లోకేష్ లుక్.. ఆయన్ను కాపీ కొట్టారా?