CJI NV Ramana- Modi: తెలుగువాడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మరి కొద్ది రోజుల్లో పదవి విరమణ చేయబోతున్నారు. దిగిపోతున్న ఈ సమయంలో ప్రధానమంత్రి మోడీకి గురువారం గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పటికే దేశంలో ఈడీని కక్ష సాధింపు కోసం వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో వారికి ఊరటగా సుప్రీంకోర్టు ఈ చట్టంపై తాము ఇచ్చిన తీర్పును పున: సమీక్ష చేస్తామని వెల్లడించింది. కొద్దిరోజుల క్రితమే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము తప్పు పట్టలేమని చెప్పిన సుప్రీంకోర్టు.. గురువారం అందుకు విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం.

వాజ్ పేయి ప్రభుత్వం తెచ్చినా
పీఎంఎల్ఏ చట్టాన్ని 2002లో అప్పటి ప్రధాని వాజ్ పేయి ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. యూపీఏ ప్రభుత్వం వచ్చాక 2005 నుంచి అమలు చేయడం ప్రారంభించారు. 2005 నుంచి 2014 అంటే 9 సంవత్సరాల కాలంలో పీఎంఎల్ఏ చట్టం కింద ఈడి మొత్తం 112 సోదాలు మాత్రమే నిర్వహించింది. ₹5,346 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే జప్తు చేసింది. 104 ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్ ఫైల్ చేసినా ట్రయల్ కోర్టు ఈ ఆస్తులు జప్తు చేసిన ఏ కేసుల్లోనూ ఏ ఒక్కరినీ దోషులుగా నిర్ధారించలేదు. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర్నుంచి మనీ లాండరింగ్ చట్టం కింద గత ఎనిమిది సంవత్సరాల లో 3,010 చోట్ల ఈడీ సోదరులు నిర్వహించింది. 888 ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్ ఫైల్ చేసింది. సుమారు లక్ష కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసింది. ఇప్పటివరకు 23 కేసుల్లో నేరాలు రుజువు అయ్యాయి. ₹900 కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మిగతా కేసులు కోర్టులో ఉన్నాయి. యూపీఏ హయాంలో 5,400 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేస్తే ఎన్డీఏ కాలంలో ₹లక్ష కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారు.
Also Read: Moi Virunthu: విందుభోజనం పెట్టిన ఎమ్మెల్యే.. చదివింపులు ఏకంగా రూ.10 కోట్లు
ప్రతిపక్షాలు ఎందుకు ప్రశ్నిస్తున్నాయంటే
ఇక ఈ పి ఎం ఎల్ ఏ కేసుల్లో సోనియా, రాహుల్ గాంధీ, ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం, తన కుమారుడు కార్తి చిదంబరం, శరత్ పవార్, నవాబ్ మాలిక్, దేశ్ ముఖ్, సత్యేంద్ర జైన్ మొదలైన వారిపై ఈడీ కేసులు నమోదు చేసింది. వాస్తవంగా ఈ మనీ లాండరింగ్ చట్టం ఇంకా కఠినంగా అమలు చేసేందుకు వీలుగా యూపీఏ ప్రభుత్వంలోనే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం 2012లో చాలా మార్పులు తీసుకువచ్చారు. అందులో నిందితులకు అవసరమైన రక్షణ కల్పించే సెక్షన్లకు చోటు కల్పించారు. యాదృచ్ఛికంగా ఇప్పుడు వారే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ మనీ లాండరింగ్ చట్టం ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా విచ్చలవిడి అరెస్టులు, ఆస్తుల వ్యక్తులకు అవకాశం కల్పిస్తోంది కాబట్టి ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. విషయాన్ని ఆర్థిక శాఖ మాజీ మంత్రి కుమారుడు కార్తీ చిదంబరం సుప్రీంకోర్టులో కేసు వేశారు. అయితే ఈ కేసును విచారణకు తీసుకున్న ముగ్గురు సభ్యుల బెంచ్ చట్టంలోని అన్ని సెక్షన్లను సమర్థిస్తూ తీర్పు చెప్పింది. ఈ చట్టాన్ని క్రిమినల్ ప్రొసీజర్ తో పోల్చకూడదని, అధికారులకు ఇచ్చిన అధికారాలు వారికి దక్కనప్పుడు ఈ చట్టం ఫలితాలు కాగితం మీద మాత్రమే మిగిలిపోతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ చట్టం ఎందుకు అవసరమో 1999లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా, 2012లో ఆర్థిక శాఖ మంత్రి చేసిన ప్రసంగాలను ఉటంకించింది. సుప్రీంకోర్టు ఈ తీర్పుతో చాలామంది నోర్లు మూతపడ్డాయి.

కేవలం వ్యతిరేకమైన వ్యక్తులపై నైనా
అయితే ఈడీ కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే దాడులు చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. కర్ణాటక, అస్సాం, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అక్కడ అంత జరుగుతున్న ఈ డి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసుల తాలూకు వివరాలు మొత్తం తెప్పించుకున్న జస్టిస్ ఎన్వి రమణ గురువారం తాము మొన్న ఇచ్చిన తీర్పును పున:సమీక్షిస్తామని వెల్లడించారు. దీంతో మోడీ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో జస్టిస్ ఎన్వి రమణ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ విధంగా తీర్పునివ్వటం బిజెపికి ఒక రకంగా ఇబ్బందే. అయితే తదుపరి విచారణలో ఎటువంటి తీర్పునిస్తారో అందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు.

