https://oktelugu.com/

పెరుగుతున్న ఏలూరు బాధితులు.. ప్రభుత్వం అలెర్ట్

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సృహ తప్పి, కళ్లు తిరిగి నిన్న రాత్రి పెద్ద ఎత్తున ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల సంఖ్య ఇప్పటివరకు 270కి చేరింది. వీరి సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఇప్పటివరకు 117మందిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పదిమందిని అధికారులు విజయవాడకు తరలించారు. బాధితులకు వైద్య సిబ్బంది అలుపెరగకుండా సేవలు అందిస్తున్నారు. Also Read: ప్రియమిత్రుడు కోసం కదిలివచ్చిన మెగాస్టార్ చిరు తాజాగా అస్వస్థతకు గురైన ఏలూరు బాధతులను […]

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2020 / 07:59 PM IST
    Follow us on

    పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సృహ తప్పి, కళ్లు తిరిగి నిన్న రాత్రి పెద్ద ఎత్తున ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల సంఖ్య ఇప్పటివరకు 270కి చేరింది. వీరి సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఇప్పటివరకు 117మందిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పదిమందిని అధికారులు విజయవాడకు తరలించారు. బాధితులకు వైద్య సిబ్బంది అలుపెరగకుండా సేవలు అందిస్తున్నారు.

    Also Read: ప్రియమిత్రుడు కోసం కదిలివచ్చిన మెగాస్టార్ చిరు

    తాజాగా అస్వస్థతకు గురైన ఏలూరు బాధతులను డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. వార్డులో ఉన్న ప్రతి పేషెంట్ దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు అస్వస్థతకు గురై 277 మంది చికిత్స పొందుతున్నారని.. ఇంకా మూర్చ, వాంతులు వంటి బాధితులు పెరుగుతున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వీరు చేరారని.. ఇప్పటివరకు 70మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. బాధితుల్లో 105 మంది పురుషులు, 76మంది స్త్రీలు, 46మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు.

    Also Read: వైసీపీలో వర్గ విభేదాలు.. కొట్టుకుంటున్న నేతలు

    డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తాజాగా మంత్రి నాని పర్యవేక్షణో కలెక్టర్, అధికారులతో కమిటీ వేశారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కలెక్టర్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ సీఎం జగన్ సోమవారం బాధితులను పరామర్శిస్తారని తెలిపారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తార్నారు. ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో 108 వాహనాలు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. సీఎం జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సీఎం కార్యాలయం నుంచి గంట గంటకు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని మంత్రి తెలిపారు.