spot_img
Homeఆంధ్రప్రదేశ్‌NTR Away From His Children Marriage: పిల్లల వివాహానికి దూరంగా ఎన్టీఆర్.. అసలేం జరిగిందంటే?

NTR Away From His Children Marriage: పిల్లల వివాహానికి దూరంగా ఎన్టీఆర్.. అసలేం జరిగిందంటే?

NTR Away From His Children Marriage: ఇంటి పెద్ద లేకుండా ఆ ఇంట్లో వివాహం జరుగుతుందా? అటువంటిది ఎన్టీఆర్ లేకుండానే బాలక్రిష్ణ, రామక్రిష్ణల వివాహాలు అయ్యాయి. 1982 డిసెంబరు 8న ఎన్టీఆర్‌ ఇంట్లో పెళ్లిబాజాలు మోగాయి. కానీ ఆ సమయంలో పార్టీ ప్రకటన, ఎన్నికల సన్నద్ధతలో ఎన్టీఆర్ ఉన్నారు. పిల్లల పెళ్లి సంబంధాల విషయంలో అన్నీ మాట్లాడిన ఎన్టీఆర్‌.. అప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నందున వారి వివాహాలకు మాత్రం హాజరుకాలేకపోయారు. వధూవరులను ఫోన్‌లో ఆశీర్వదించారు. బాలకృష్ణ, రామకృష్ణల పెళ్లి రోజున ఎన్టీఆర్‌ లేకపోవడంతో బసవతారకం కన్నీరుపెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆయన్ను చూడకుండా ఉండలేనంటూ నెల్లూరు జిల్లాలో ప్రచారం చేస్తున్న ఆయన దగ్గరకు బయలుదేరారు. ఆ జిల్లాలో ఆయన పర్యటించే ఒక ప్రాంతంలో ఆయన రాక కోసం వేచి చూశారు. అడుగడుగునా జనం వెల్లువెత్తడంతో చాలా గంటలు ఆలస్యంగా ఎన్టీఆర్‌ అక్కడికి చేరుకున్నారు. జనం మాత్రం చెక్కుచెదరని అభిమానంతో ఆయన కోసం వేచి చూస్తున్నారు. ఆయన్ను చూసి వారిలో ఆనందం వెల్లువెత్తింది. నల్లగా మారిన ఎన్టీఆర్‌ను చూడగానే బసవతారకం దుఃఖం ఆపుకోలేకపోయారు. ఈ రాజకీయాలు వద్దు. నాకు, నా పిల్లలకు మీరే కావాలి అంటూ ఎన్టీఆర్‌ను పట్టుకుని భోరున విలపించారు. ఎన్టీఆర్‌ ఆమెను ఓదార్చి… జనాన్ని చూపిస్తూ వీళ్లంతా ఎవరు తారకం? వీరు మాత్రం మనవాళ్లు కారా? అన్నారు. ఆ మాటతో బసవతారకం ఊరట చెందారు.

NTR Away From His Children Marriage
Taraka Rama Rao

Also Read: Pawan Kalyan Laid His Hands On The Director: డైరెక్టర్ పై చెయ్యి చేసుకున్న పవన్ కళ్యాణ్.. కారణం ఏంటో తెలుసా?

మొండి ఘటం

ఎన్టీఆర్‌ చాలా పార్శ్యాలు ఉన్నాయి. ఎంత ప్రేమ చూపిస్తారో అంత మొండిఘటం. చిత్తూరు జిల్లాలో ప్రచారం చేస్తుండగా గుర్రంకొండలో ఏర్పాటు చేసిన స్టేజీపై చాలామంది ఎక్కారు. దీంతో… వేదిక కూలిపోయింది. ఎన్టీఆర్‌ కాలికి గాయమై, రక్తం ధారగా కారింది. గాయాన్ని పట్టించుకోకుండా, కార్యకర్తలు వద్దని చెప్పినా చైతన్యరథంపైకి ఎక్కి ఎన్టీఆర్‌ ఉపన్యసించారు. ఆ తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో ఆయనకు మరో రెండుసార్లు దెబ్బలు తగిలాయి. అయినా, వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ఆయన ప్రచారం కొనసాగించారు. ఒకసారి చైతన్యరథంలో ఏకబిగిన 23 గంటలు ప్రచారం చేశారు. ప్రచార రథంపై రెండు ఫ్లడ్‌లైట్లు బిగించి, వాటి కాంతి ఎన్టీఆర్‌పై పడేలా ఏర్పాట్లు చేయడంతో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఎన్టీఆర్‌ను చూసేందుకు ప్రజలు ఎదురుచూసేవారు. అన్నపానీయాలూ సరిగా ఉండేవి కావు. మధ్యాహ్నం తినాల్సిన అన్నం ఏ సాయంత్రానికో, రాత్రికో చల్లగా అయిపోయాక తినాల్సివచ్చేది.

NTR Away From His Children Marriage
Sr NTR

Also Read: Analysis on Pawan Kalyan Questions YCP : పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానాలేవి ?

Recommended Video:
ఎన్టీఆర్ నట విశ్వరూపానికి  నిదర్శనాలు ఇవే || Sr NTR Birthday Special Video || NTR Satha Jayanthi

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version