spot_img
Homeజాతీయ వార్తలుTelangana Job Notification: నోటిఫికేషన్లు ఆలస్యం.. తెలంగాణ నిరుద్యోగులకు షాక్..

Telangana Job Notification: నోటిఫికేషన్లు ఆలస్యం.. తెలంగాణ నిరుద్యోగులకు షాక్..

Telangana Job Notification:  తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైందని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఇక ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రంగంలోకి దిగారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్ల విడుదలతో జాప్యం చేస్తోంది. ఫలితంగా అభ్యర్థులకు శాపంగా మారుతోంది. ఇకనైనా తమ భవిష్యత్ మారుతుందని భావించినా దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా పరిస్థితి మారటం కనిపిస్తోంది.

Telangana Job Notification
KCR

ఈ నేపథ్యంలో 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిసినా వాటి భర్తీకి నోటిఫికేషన్లు మాత్రం రావడం లేదు. దీంతో నిరుద్యోగులు కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు. మార్చి 23న 30 వేల ఖాళీలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం మంజూరు ఇచ్చినా ఇందులో గ్రూప్స్ ఉద్యోగాలు ఉండటంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. ఇన్నాళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూసిన సందర్భంలో ఇకనైనా తమ కల నెరవేరుతుందా అంటే లేదనే విషయం స్పష్టమవుతోంది.

Also Read: Pakistan National Assembly Dissolved: జాతీయ అసెంబ్లీ రద్దు.. ఎన్నికలకు వెళుతున్న ఇమ్రాన్ ఖాన్.. ప్రతిపక్షాలకు షాక్

నోటిఫికేషన్లు విడుదల చేస్తే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే ఉద్దేశంతోనే టీఎస్పీఎస్ ముందస్తు చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. నోటిఫికేషన్ విడుదల చేశాక మళ్లీ ఏదైనా న్యాయపరమైన చిక్కు ఎదురైతే వాయిదా పడితే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారనే నోటిఫికేషన్ విడుదలలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ నిరుద్యోగులకు మాత్రం ఆలస్యం అమృతం విషం అనే ధోరణిలోనే ఉన్నారు.

Telangana Job Notification
KCR

ఇప్పటివరకు 16 శాఖలకు చెందిన ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్, రోస్టర్ వివరాలు వచ్చాయని టీఎస్పీఎస్ చెబుతోంది. ఇంకా మూడు శాఖలకు సంబంధించిన వివరాలు రావాల్సి ఉందని సూచిస్తోంది. అందుకే అన్ని వివరాలు వచ్చాకే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని పేర్కొంది. అందుకే ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడానికి ఆలస్యం జరుగుతోంది. దీనిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా ఉద్యోగం సంపాదించడమే ధ్యేయంగా ఉన్న నిరుద్యోగుల ఆశలు ఎప్పటికి తీరేనో ఎదురు చూడాల్సిందే మరి.

Also Read:Balakrishna New Look: వైరల్ : ఓల్డ్‌ గెటప్‌ లో హీరో.. పవర్‌ ఫుల్‌ గెటప్‌ లో విలన్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper