PM Modi- Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ మానవాళి నష్టాల్లో కూరుకుపోతోంది. దీంతో రెండు దేశాల మధ్య శాంతి కుదురుతుందనే నమ్మకాలు కూడా పోతున్నాయి. రోజురోజుకు భీకర పోరుకే ప్రాధాన్యం ఇస్తున్నాయి ఈ తరుణంలో మన దేశం ఉద్దేశం ఏమిటని పలు ప్రశ్నలు వస్తున్నాయి. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా మనది శాంతి మంత్రమే అని చెబుతున్నా వారు నమ్మడం లేదు. రష్యాతో స్నేహం చేస్తూనే శాంతిజపం వల్లిస్తోందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తంది. కానీ మనది ముమ్మాటికి శాంతి మంత్రమే. శాంతి జరగాలని కోరుకుంటుంది కూడా మనమే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ప్రధాని విదేశీ పర్యటన ప్రాధాన్యం సంతరించకుంది. నిన్న జర్మనీ దేశంలో పర్యటించిన మన మోడీ మన దేశ విధానాన్ని ప్రకటించారు. యుద్ధంలో ఎవరు గెలవరని అందరు నష్టపోతారని తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. భారత్ ఎప్పుడు శాంతినే కోరుకుంటుందని కానీ యుద్ధాన్ని మాత్రం కాదని తేల్చిచెప్పింది. యుద్ధంతో అందరికి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని కుండబద్దలు కొట్టింది. యుద్ధం కారణంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎరువులు కూడా దొరకని పరిస్థితి. దీంతో అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Rahul Gandhi Visit To Telangana: రాహుల్ గాంధీ టూర్.. కేసీఆర్ ఈసారి ఎలా ట్రీట్ చేస్తాడో?
జర్మనీ చాన్సలర్ స్కోల్డ్ తో భేటీ అయిన ప్రధాని పలు విషయాల్లో చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇద్దరు ఆకాంక్షించారు. జీ-7 దేశాల సమావేశానికి భారత్ ను ఆహ్వానించినట్లు చెప్పారు. ప్రధానితోపాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ప్రధాని వెంట ఉన్నారు.
రెండు దేశాల మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 2018, జులై 2017, మే 2017, ఏప్రిల్ 2015 సంవత్సరాల్లో జర్మనీలో పర్యటించారు. ఆయన పర్యటన ఇది ఐదో సారి. దీంతో వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలు మెరుగుపడాలని కోరుకున్నారు. భవిష్యత్ లో రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య బంధాలు బలోపేతమై రెండు దేశాలు తిరుగులేని శక్తులుగా ఎదగాలని అభిప్రాయపడ్డారు.
మొత్తానికి ఉక్రెయిన్ విషయంలో మన దేశం మొదటి నుంచి ఒకటే వాదన చేస్తున్నా ఏ దేశం కూడా పట్టించుకోవడం లేదు. రష్యాను ఏకాకిని చేయాలని చూస్తున్న అమెరికాకు ఇండియా కంటగింపుగా మారింది. అందుకే ఇండియాను టార్గెట్ చేసుకుని అమెరికా పలు మార్గాల్లో దాడి చేయాలని చూస్తోంది. మన ప్రధాని మాత్రం తాను అనుకున్నది చెబుతూ శాంతి కోరుకోవడమే తమ ప్రధాన కర్తవ్యమని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. కానీ ఇంతకన్నా ఎక్కువగా ఏం చేయగలం. అది అమెరికా లాంటి దేశాలు అర్థం చేసుకుంటే తప్ప పరిష్కారం దొరకదు.
Also Read: Teenmar Mallanna: బీజేపీకి గుడ్ బై.. ‘టీం-7200’.. కొత్త పార్టీ దిశగా తీన్మార్ మల్లన్న
Recommended Videos:
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: No one will be victorious in russia ukraine war says pm modi in germany
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com