
అది ఉమ్మడి రాష్ట్రం.. ఆంధ్రా నేతల ఏలుబడి.. పాలన అయినా.. సినిమాలైనా తెలం‘గానం’ కామెడీకే పనిచేసింది. స్వయం ప్రతిపత్తి, స్వావలంబన కోసం ఆరాటపడింది. ఒకప్పుడు తెలంగానం అన్నా.. తెలంగాణ సంస్కృతి అన్నా ఉమ్మడి ఏపీలో ఏహ్యభావమే. అయితే మారుతున్న కాలం అన్నింటిని మార్చేసింది. తెలంగాణ తెచ్చింది. తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేసింది. బతుకమ్మకు గౌరవమొచ్చింది.. బోనాలు నెత్తిన ఎక్కి కూర్చింది.
ఉమ్మడి ఏపీ విడిపోయాక ఎన్నో సంస్కరణలు. పక్కా తెలంగాణ వాధి.. భాష పిపాసి కేసీఆర్ అన్నింటిని తెలంగాణాకీరించారు. ఆంధ్రా భావజాలం పదజాలాన్ని పక్కనపెట్టి తేట తెలంగాణ పదాలను కూర్చారు. పథకాల నుంచి వాడుక వరకు అంతటా తెలంగానం చేశారు.
అయితే ఇప్పటికీ తెలంగాణలో ఖరీఫ్, రబీలను ఆ పేరుతో ఎవరూ పిలవరు. తాత ముత్తాల నుంచి వానాకాలం పంట.. యాసంగి అని ఖరీఫ్, రబీలను పిలుస్తూనే ఉంటారు. అయితే మన పత్రికలు.. ప్రభుత్వాలు రాసుకోవడానికి వాడడానికి ఖరీఫ్, రబీ అంటూ తెగ జన బాహుల్యంలోకి ప్రచారం చేసిన సగటు తెలంగాణ వాది మాత్రం వానాకాలం, యాసంగినే వాడతుంటారు.
తెలంగానమన్నా.. ఇక్కడి సంస్కృతి అన్న పెద్దపీట వేసే కొసుకునే కేసీఆర్ ఊరుకుంటారా? మన పండుగలు పబ్బాలు.. పథకాల పేర్లు ఏంటీ అన్నింటిని మార్చేసిన ఆయన ఇప్పుడు తెలంగాణ సాగులోనూ సంస్కరణ బాట వేశారు. కాళేశ్వరం నీటితో పంటను ఈ సంవత్సరం అత్యధికంగా పండించి రికార్డు సృష్టించారు. అంతేకాదు.. రాబోయే రోజుల్లోనే భారతదేశానికి తెలంగాణను ధాన్యాగారంగా మార్చే పనిలో పడ్డారు. అంత చేసిన కేసీఆర్ సాగు సంస్కరణలు చేయకుండా ఉంటారా? అదీ చేసేసారు.
తాజాగా తెలంగాణ పంట సీజన్ల పేర్లను మారుస్తూ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్, రబీ పేర్లను మారుస్తూ వానాకాలం పంట మరియు యాసంగిగా మార్చాలని ఆదేశించారు, ఇన్నాళ్లు ఖరీఫ్ , రబీ అంటే ఎవరికీ అర్థం అయ్యేది కాదని.. అందుకే ఈ తెలంగాణ పదాలు అందరికీ అర్థమయ్యేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఇక నుంచి పంట విత్తనం నుంచి కోసే వరకు వ్యవసాయ లెక్కలు.. పత్రాలు.. బ్యాంకు రుణాలు అన్నింటికి ఈ పదాలే ఆధారంగా చేసేశారు. డిపార్ట్‌మెంటల్ ఆర్డర్లు, కార్పొరేషన్లు, వ్యవసాయ సంస్థలు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాలు మరియు సిలబస్‌లలో ఈ మేరకు ఈ పదాలను మార్చి ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇలా తెలంగాణ విడిపోయాక తెలం‘గానం’ నిజంగానే వినిపిస్తోంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు అక్షరసత్యాలను చేస్తూ కేసీఆర్ అదే పంథాలో పయనిస్తున్నారు. తెలంగాణ భాష, యాసకు ఇన్నాళ్లుగా జరిగిన వివక్షకు చరమగీతం పాడుతున్నారు. తెలంగానాన్ని అందలమెక్కిస్తున్నారు..