YS Jagan: జగన్ ను ఏం చేయకుండా చేస్తున్నారా?

YS Jagan: తాను ఒకటితలిస్తే, దైవమొకటి తలచిందన్నట్లుగా తయారయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. అధికారంలోకి రాకముందు ఎన్నో అనుకున్నారు కానీ తీరా అధికారంలోకి వచ్చాక ఏదీ చేయలేని స్థితి. దీంతో ఆయన హామీలన్ని నీటిమూటలుగానే మారిపోతున్నాయి. సగటు ఓటరు నిరాశతోనే ఉన్నాడని తెలుస్తోంది. అనుకున్నవన్ని జరిగితే మనిషి ఎలా అవుతాడు దేవుడవుతాడు అన్నట్లుగా ఏపీ దుస్థితి మారిపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం […]

Written By: Srinivas, Updated On : September 9, 2021 11:43 am
Follow us on

YS Jagan: తాను ఒకటితలిస్తే, దైవమొకటి తలచిందన్నట్లుగా తయారయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. అధికారంలోకి రాకముందు ఎన్నో అనుకున్నారు కానీ తీరా అధికారంలోకి వచ్చాక ఏదీ చేయలేని స్థితి. దీంతో ఆయన హామీలన్ని నీటిమూటలుగానే మారిపోతున్నాయి. సగటు ఓటరు నిరాశతోనే ఉన్నాడని తెలుస్తోంది. అనుకున్నవన్ని జరిగితే మనిషి ఎలా అవుతాడు దేవుడవుతాడు అన్నట్లుగా ఏపీ దుస్థితి మారిపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు.

ఇక మూడు రాజధానుల వ్యవహారంలో ముందు చూపు లేకుండా పోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జగన్ అధికారంలోకి రాకముందే ఆయనకు మూడు రాజధానుల ఆలోచన ఉన్నా అప్పుడు బయటపెట్టలేదు. తీర్పు ఒకవేళ జగన్ కు అనుకూలంగా వచ్చినా ప్రత్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తారని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం మూడు రాజధానులపై ఏ నిర్ణయం తీసుకుంటుందో అని పార్టీల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మరో వైపు కరోనా వైరస్ ధాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. దీంతో ప్రభుత్వం అష్ట కష్టాలు పడుతోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని ఆశిస్తున్నా నిధుల లేమి వెంటాడుతోంది. రాష్ర్టంలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఇచ్చిన హామీని గాలికొదిలేస్తుంది. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరిగిపోతోందని తెలుస్తోంది. సామాజిక పింఛన్లు ఏటేటా పెంచుతామని చెప్పినా ఆచరణలో కనిపించడం లేదు.

రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై జగన్ ఏం చేయలేకపోతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పథకాలు ఎలా ముందుకు తీసుకెళ్లేదని చెబుతున్నారు. కరోనా వైరస్ తగ్గితే ఆర్థిక వ్యవస్థ కొంత కోలుకునే అవకాశం ఉంటుంది. కానీ కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే జగన్ మాత్రం ఏం చేయలేరని తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీకి విజయం అంత సులువు కాదనే విషయం బోధపడుతోంది. సంక్షేమ పథకాలే తప్ప ఏ పని కూడా ఏపీలో చేయడం లేుదు. ఈ నేపథ్యంలో రాబోయే రోజులు గడ్డుగానే మారే సూచనలు కనిపిస్తున్నాయి.