
టీడీపీ తన ప్రాభవాన్ని కోల్పోతుందా? కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో పరిస్థితి పూర్తిగా వైసీపీ వశమైపోతోందా? ఇక టీడీపీ అడ్రస్ గల్లంతేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకప్పుడు వెలుగు వెలిగిన టీడీపీ రానురాను తన గత వైభవాన్ని కోల్పోతుంది. 2019 ఎన్నికల తర్వాత జిల్లాలో టీడీపీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. అప్పుడు వైసీపీ14 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు గెలుచుకుంటే టీడీపీ 2 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. అయితే జిల్లాలో టీడీపీ ఇంత దారుణంగా ఓడిపోవడం ఇదే తొలిసారి. తర్వాత బలం పుంజుకుందా అంటే అదీ లేదు. విజయవాడ, గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ రెండు స్థానాలు ఇప్పుడు వైసీపీ వరమైపోయాయి.
ఓటమికి కారణమెవరు?
జిల్లాలో టీడీపీ ఓటమి చెందడానికి కారణమెవరు అంటే సమాధానం లేదు. వైసీపీ విధానాలతో రాష్ర్టం మొత్తం బలం పెంచుకుంటుంటే టీడీపీ బలం రానురాను తగ్గిపోతోంది. టీడీపీ విధానాలే పార్టీ అపజయానికి కారణమవుతున్నాయని నాయకులు విమర్శిస్తున్నారు. అధినేత చంద్రబాబు సైతం పార్టీని సరైన దిశలో నడిపించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని ముందుకు నడిపించే క్రమంలో సరైన నేత ఉండాలని భావిస్తున్నారు.
వైసీపీకి ఆకర్షితులు
టీడీపీకి మంగళం పాడి వైసీపీకి ఓటు వేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో దాదాపు టీడీపీ గల్లంతైపోతోంది. ఎన్టీఆర్ పుట్టిన గడ్డలో పార్టీ వైభవం కోల్పోవడం వెనుక అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలే బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. వైసీపీ విధానాలతో పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
పార్టీని నడిపించే వారెవరు?
టీడీపీని నడిపించే వారెవరు. అధికారం అందనంత దూరంలో నిలవడంతో పార్టీకి జవసత్వాలు నింపి విజయతీరాలకు చేర్చే నేత కోసం అన్వేషిస్తున్నారు. చంద్రబాబుకు వయసు మీద పడడంతో పార్టీని నడపలేకపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం.