
‘ఆర్జీవీ’ అనేవాడు ఓ ‘వింత జీవి’ అని రామ్ గోపాల్ వర్మ తన గురించి తానే సగర్వంగా ప్రకటించుకున్న వైవిధ్యం వర్మది. అసలు వర్మ ఏమి చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రత్యేకతను చాటుకుంటూ ఏకంగా మోదీ పైనే ఓ ఫన్నీ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఇలాంటి విషయాల్లో తనకు పోటీ సాటి ఎవరు లేరని వర్మ మరోసారి ఘనంగా నిరూపించుకున్నాడు.
ఇంతకీ వీడియోలో మ్యాటర్ ఏమిటంటే.. ప్రస్తుతం ఉన్న కరోనా కఠిన పరిస్థితుల పై ప్రధాని మోదీ ఓ సందర్భంలో భావోద్వేగానికి లోనవుతూ మాట్లాడిన మాటలను తీసుకుని, ఆస్కార్ బెస్ట్ యాక్టర్ నామినేషన్ అవార్డుల ప్రకటన వీడియోలో పెట్టి.. మొత్తానికి ప్రధానిని కించపరిచేట్టు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పైగా వీడియో చివర్లో ప్రధాని నరేంద్ర మోదీ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డుకు అర్హులు అంటూ చూపించన షాట్ కూడా ఫన్నీగా ఉంది.
అయితే, దేశంలో కరోనా విజృంభిస్తున్న తీరుకు ప్రజలు భయంతో వణికిపోతుంటే.. వర్మ ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించడం, ఏకంగా దేశ ప్రధానినే అవమానించేలా వీడియోని ఎడిట్ చేసి షేర్ చేయడం, అది కాస్త ఇప్పుడు వైరల్ అవ్వడం బీజేపీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అయినా, ఈ కరోనా ఉధృతిలో వర్మ ఈ వీడియోని పోస్ట్ చేసినందుకు అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ అభిమానులు కోరుతున్నారు.
ఐతే, మన దేశంలో కరోనా కట్టడికి మోదీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని, దేశ ప్రజలకు వ్యాక్సిన్ ను అందించడంలో కూడా ప్రధాని మోదీ విఫలమయ్యారని ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. మరి వర్మకి కూడా ఈ ఫీలింగ్ ఉందేమో. ఈ మధ్య ఎక్కువగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నాడు. మరోపక్క ఛాన్స్ దొరికితే చీటికి మాటికి కరోనా వైరస్, ప్రధాని మోదీ పై సెటైర్లు వేస్తున్నాడు.
THE BEST OSCAR EVER🙏🙏🙏 pic.twitter.com/KRfD0UTlrb
— Ram Gopal Varma (@RGVzoomin) May 22, 2021