
రాష్ట్రంలోని వ్యాయమ విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసం లేకుండా జూన్ 5వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని కన్వీనర్ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు వెబ్ సైట్ ద్వారా తమ అఫ్లికేషన్లను సమర్పించవచ్చని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ. 400 ఇతరులు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది.