
ప్రధాని మోడీ ఇటీవల అందరు సీఎంలతో కలిసి నీటి ఆయోగ్ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి కొన్ని ఆలోచనలను మోడీతో పంచుకున్నారు. ఈ ఆలోచనలను మెచ్చిన నీతి ఆయోగ్.. ఆయనకు సిక్స్ జీ సీఎం అని హ్యాష్‌ట్యాగ్ పెట్టి అభినందించింది. భారత్ నెట్‌కు సంబంధించి తన ఆలోచనలను జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ ఆలోచనలు చాలా గొప్పవని.. నీతి ఆయోగ్ ప్రశంసించింది.
Also Read: ఎట్టకేలకు కేంద్రానికి చంద్రబాబు లేఖ
జగన్మోహన్ రెడ్డి వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను గ్రామస్థాయి వరకూ తీసుకెళ్లాలని.. అందుకోసం అంతరాయాలు లేని హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యాచరణ కూడా ఖరారు చేసుకున్నారు. ఇది నీతి ఆయోగ్‌ను బాగా ఆకర్షించింది. అందుకే సిక్స్ జీ సీఎం అని ట్వీట్ చేసింది. గత ప్రభుత్వం ఫైబర్ నెట్ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించింది. అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తే ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని పోల్స్ మీద కేబుల్స్ వేసి కనెక్షన్లు ఇవ్వడం ప్రారంభించారు.
Also Read: ‘విశాఖ ఉక్కు’పై స్పందించిన చంద్రబాబు.. ప్రధాని మోదీకి లేఖ..
ఏపీలో ఇప్పటి వరకూ పది లక్షల మందికి ఫైబర్ నెట్ కనెక్షన్ ఉందని అంచనా. ఇందులో టీవీతోపాటు ఇంటర్‌నెట్ కనెక్షన్ కూడా వస్తుంది. దీనికి బాగా డిమాండ్ ఉండటంతో 60 లక్షల మంది సబ్‌స్క్రైబర్లకు ఫైబర్ నెట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ అనే ప్రోగ్రాంను డిజైన్ చేసింది. ఇది ఫైబర్ నెట్ లాంటిదే. దాని ద్వారా వచ్చే ఆర్థిక సాయాన్ని ఫైబర్ నెట్‌కు వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
కేంద్రం ఈ అంశంపై స్పష్టమైన అవగాహనతో ఉంది. పబ్లిక్ డేటా ఆఫీస్ , పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు, యాప్ డెవలపర్లు ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పుతారు. ఎలాంటి అనుమతులు, రుసుం, నమోదు అవసరం లేకుండానే పీడీఓల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తారు. వైఫై సేవల విస్తరణలో భాగంగా కోటి డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిలో ఏపీకి కావాల్సినన్ని సొంతం చేసుకుని సీఎం జగన్ గ్రామాల్లోనూ వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు ఇంత గొప్ప ప్రశంసలు దక్కాయి. ఎంతైనా జగన్ మరోసారి తన సత్తా ఏంటో చాటారు. యంగ్ సీఎం.. యంగ్ ఐడియాస్ అన్నట్లుగా సలహాలు ఇచ్చి ప్రశంసలు పొందడం ఏపీ రాష్ట్రానికి ఆనందాన్నిచ్చింది.