https://oktelugu.com/

Niti Aayog: ఏపీకి ఊహించని రిప్లై ఇచ్చిన నీతి అయోగ్..

Niti Aayog: తాజాగా ఏపీ ప్రభుత్వం నీతి అయోగ్ కు లేఖ రాసింది. అయితే వీళ్ళు రాసిన లేఖకు వారి నుండి అనూహ్య స్పందన వచ్చింది. కేద్ర ప్రభుత్వం తాజాగా మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల అన్నిటిని అమ్మేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముందు నుండే ఇలాంటి అవకాశాలను ఏపీ ప్రభుత్వం అస్సలు వాదులు […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 19, 2021 / 06:10 PM IST
    Follow us on

    Niti Aayog: తాజాగా ఏపీ ప్రభుత్వం నీతి అయోగ్ కు లేఖ రాసింది. అయితే వీళ్ళు రాసిన లేఖకు వారి నుండి అనూహ్య స్పందన వచ్చింది. కేద్ర ప్రభుత్వం తాజాగా మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల అన్నిటిని అమ్మేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

    Niti Aayog

    ముందు నుండే ఇలాంటి అవకాశాలను ఏపీ ప్రభుత్వం అస్సలు వాదులు కునేది కాదు.. మరి స్వయంగా కేంద్రం ఇచ్చిన ఈ అవకాశాన్ని మాత్రం ఎలా ఒదులు కుంటుంది.. మానిటైజేషన్ పేరుతొ కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తున్న ఈ పధకాన్ని ఏపీ ప్రభుత్వం వెంటనే వాడుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది. భూముల్ని అమ్ముతున్నాం.. కానీ కోర్టులో కేసులు పడ్డాయి.. మీరు కూడా వచ్చి ఇంప్లీడ్ అయితే కోర్ట్ సానుకూల నిర్ణయం చెబుతుంది.. అని ఎపి ప్రభుత్వం నీతి అయోగ్ కు లేఖ రాసింది.

    Also Read: సినిమా టికెట్ల వివాదం.. జగన్ పంతమా? సినీ ఇండస్ట్రీ పట్టుదలా నెగ్గుతుందా?

    అయితే ఈ లేఖకు నీతి అయోగ్ నుండి ఊహించని రిప్లై ఇచ్చింది. నీతి ఆయోగ్ ఏపీ కి ఇచ్చిన రిప్లై ప్రకారం.. తాము ప్రభుత్వ సంస్థలు.. మౌలిక సదుపాయాలు ప్రోజెక్టుల గురించి చెప్పం కానీ.. భూముల గురించి కాదని.. అంటే సృష్టించిన ఆస్తులను అమ్మమన్నాం కానీ భూములను కాదని స్పష్టం చేసింది. భూముల అమ్మకానికి తాము వ్యతిరేకమని.. హైకోర్టులో జరుగుతున్న భూముల అమ్మకం కేసుల్లో తాము ఇంబ్లీడ్ కాలేమని తెలిపింది.

    ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అమ్ముకోవచ్చు అని కేంద్రం చెబితే ఏదైనా అమ్ముకోవచ్చన్న తాపత్రయంలో జగన్ ప్రభుత్వం ఉందని చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. క్వార్ట్రర్స్, మార్కెట్లు ఇలా దేన్నీ అయినా అమ్మెందుకు మిషన్ బిల్డ్ ఏపీని ప్రారంభించారు. కానీ అలంటి ఆస్తులను అమ్మడం అందులోనే అవి దాతలు ఇచ్చిన భూములు కావడంతో చట్ట వ్యతిరేకమని కోర్టుకు వెళ్లడంతో ఎక్కిడివక్కడ ఆగి పోయాయి. ఎన్ని విమర్శలు వచ్చిన ఎపి ప్రభుత్వం మాత్రం తమ పనులను చేసుకుంటూ పోతుంది.

    Also Read: అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ.. చెల్లించే పరిస్థితి అయితే కనిపించడం లేదు!

    Tags