Boyapati – Bunny: అఖండతో తాను యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం అని బోయపాటి శ్రీను మరోసారి ఘనంగా నిరూపించుకున్నాడు. అందుకే, ఇప్పుడు అల్లు అరవింద్ నిర్మాణంలో అల్లు అర్జున్ తో చేయబోతున్న సినిమా పై అందరికీ ఆసక్తి రెట్టింపు అయింది. అసలు బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ అనగానే ఆ కలయిక పై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ నుంచి స్టార్ట్ కానుంది.

పైగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీసుకురాబోతున్నారు. ఇప్పటికే బన్నీ కోసం ఓ పక్కా మాస్ స్క్రిప్టును బోయపాటి సిద్ధం చేశాడు. ఈ సినిమా ఓ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉంటుందట. అయినా బోయపాటి సినిమా అంటే యాక్షనే ఉంటుంది కదా. కాకపోతే బన్నీకి సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సారి పర్ఫెక్ట్ కథను రెడీ చేశాడట.
Also Read: సుధీర్ స్థానంలో బిగ్ బాస్ అఖిల్.. అసలు మల్లెమాలలో ఏం జరుగుతుంది?
ఎలాగూ సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. భారీ స్థాయి అంటే.. పాన్ ఇండియా స్థాయి అని. పుష్ప ఎలాగూ బన్నీకి పాన్ ఇండియా గుర్తింపు తీసుకు వచ్చింది. ఆ గుర్తింపు బోయపాటి సినిమాకి బాగా ప్లస్ కానుంది. పైగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటిస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు గుప్పుమంటున్నాయి.
మరి అక్షయ్ – బన్నీ కలయిక పై క్లారటీ వచ్చేదాకా సోషల్ మీడియాలో ఈ వార్తకు సంబంధించిన పుకార్లు పుంఖానపుంఖాలుగా వస్తూనే ఉంటాయి అనుకోండి. ఏది ఏమైనా బోయపాటి తనకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ అంటూ అల్లు అర్జున్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా గొప్పగా చెప్పడం విశేషం. హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటి నిజంగానే మేటి.
Also Read: త్రివిక్రమ్ రాసిన గొప్ప డైలాగ్స్ ఇవే !