NIA Searches: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, భైంసాతోపాటు ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో తనిఖీలు జరుగుతున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరాతీస్తున్నట్టు సమాచారం.

నిజామాబాద్ లోని బోధన్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు. తెల్లవారుజాము 4 గంటల నుండి ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ లో మొత్తం 20 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. జగిత్యాలలో మూడు ఇళ్లతోపాటు టవర్ సర్కిల్ లోని కేర్ మెడికల్, టీఆర్ నగర్ లో ఒక ఇంటిలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి డైరీలు, పలు పత్రాలు స్వాధీనం చేసుకుంది.
అలాగే ఏపీలోని కర్నూల్, గుంటూరు జిల్లాలో ఎన్ఐఏ దాడులు చేశారు. . కర్నూల్, కడప ప్రాంతాల్లో మరో 23 బృందాలతో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాలో రెండు బృందాలతో సోదాలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఈ సోదాలు జరుపుతున్నట్టు తెలిసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) జిల్లా కన్వీనర్ షాదుల్లా
సహా మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మోబిన్ లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై దేశ ద్రోహం కేసులు నమోదు
కరాటే శిక్షణ, లీగల్ అవేర్ నెస్ ముసుగులో పి ఎఫ్.ఐ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తేలింది. మతకలహాలు సృష్టించేందుకు చురుకైన అతివాదులు మతోన్మాదులకు శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు. బైంసా అల్లర్లతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అనుమానితులుగా ఉన్న వారి ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్లో మొత్తం 20 చోట్ల నాలుగు ఎన్ఐఏ బృందాలు ఏకకాలంలో సోదాలు చేస్తున్నాయి. ఉగ్రవాద మూలాలున్నాయన్న సమాచారంతోనే ఎన్ఐఏ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.