NIA Gets Threat E-mail to Assassinate PM Modi: దేశంలో ప్రధానమంత్రి మోడీని హత్య చేస్తానంటూ ఓ అగంతకుడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు ఈమెయిల్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. తన వద్ద 20 కిలోల ఆర్డీఎక్స్ ఉందని బెదిరిస్తున్నాడు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాని భద్రతపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనవసరంగా బెదిరించడానికి చేసిందా? లేక నిజంగానే ఆగంతకుడు కుట్ర పన్నాడా అనే కోణంలో విచారిస్తున్నారు. అసలు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? ఇందులో ఉగ్రవాదుల ప్రమేయం ఉందా? అనే కోణలో విచారణ చేపట్టారు.

ఇటీవల కాలంలో ప్రధానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఎవరైనా ఆకతాయిగా ఈ పని చేశారా? అని అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న కుట్రల్లో భాగంగానే ఈ కాల్ వచ్చిందా అని ఆరా తీస్తున్నారు. మొత్తానికి ప్రధాని భద్రతపై అందరిలో ఆందోళన నెలకొంది. ప్రధాని రక్షణకు సర్వశక్తులు ఒడ్డేందుకు నిర్ణయించుకుంది. దీంతో వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Tiger Nageswara Rao Movie New Update: నాగేశ్వరరావు’ కోసం మరో హీరోయిన్ రెడీ
దేశంలో అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించడంతో సహజంగానే ప్రధాని మోడీ ప్రతిష్ట మరింత పెరిగింది. ఈ కోణంలోనే ఆయనపై కుట్ర పన్నుతున్నారనే వాదన కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి భద్రతపై భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎలాంటి నీడ పడకుండా చూసుకునేందుకు రక్షణ పెంచుతున్నారు.

మరోవైపు ఈ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది? అనే విషయంపై సైబర్ సెక్యూరిటీ విభాగంతో నిఘా ఏర్పాటు చేసింది. అందులో ఏ గ్రూపులు ఉన్నాయి? వారి బలమెంత? బలగమెంత? అసలు వారెవరు? అనే దానిపై కూలంకషంగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో వివిధ ఉగ్రవాద సంస్థలుండటంతో దేని పని అని తెలుసుకునేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మొత్తం వివరాలు సేకరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.
Also Read: Harnaaz Sandhu: నాకు ఆ వ్యాధి ఉంది.. మిస్ యూనివర్స్ షాకింగ్ కామెంట్స్