Rushikonda Mining: సాగర నగరంలో విధ్వంసాలకు దిగుతున్న జగన్ సర్కార్‌కు మరో ఝలక్ తగిలింది. విశాఖలో నిబంధనలు మీరి రుషికొండపై చేపట్టిన ప్రాజెక్టు పనులను తక్షణమే ఆపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) బుధవారం ఆదేశించింది. పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ చేపడుతున్న ఈ నిర్మాణాలను ఆపాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రైబ్యునల్.. ఆయన ఫిర్యాదులోని అంశాలపై అధ్యయనానికి ఒక కమిటీని నియమించింది. అన్నింటినీ పరిశీలించి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అంతవరకు అక్కడ ఎటువంటి పనులు చేపట్టకూడదని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు ఆదేశాలిచ్చారు. సాగర నగరంలో రుషికొండది ప్రత్యేక స్థానం చెంతనే సాగర అందాలు ఇక్కడ ప్రత్యేకత. దీంతో గత ప్రభుత్వాలు ఇక్కడ పర్యాటకంగా అభివ్రద్ధి చేశాయి.
విశాఖపట్నం-భీమిలి బీచ్‌రోడ్డులో గల రుషికొండపై ‘ఏపీటీడీసీ’ 2006లో హరిత రిసార్ట్స్‌ను నిర్మించింది. నిత్యం పర్యాటకులతో రద్దీతో చక్కగా నడుస్తు న్న ఆ రిసార్ట్స్‌ను వైసీపీ ప్రభుత్వం కూలగొట్టి పర్యాటక ప్రాజెక్టు (అతిథిగృహాలు, కన్వెన్షన్ సెంటర్‌తో పాటు సీఎం క్యాంపు కార్యాలయం కూడా నిర్మిస్తారనే ప్రచారం ఉంది) చేపడతామంటూ అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. కొండపై 69.65 ఎకరాలు ఉండగా 9.88 ఎకరాల్లో ఏడు బ్లాకులతో 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతులు తీసుకుంది.
Also Read: Pawan Kalyan: బలంపై జనసేనకు ఫుల్ క్లారిటీ.. వ్యూహం మార్చిన పవన్..
అయితే రుషికొండలో హరిత రిసార్ట్స్ ఉన్న ప్రాంతం అంతా సీఆర్‌జెడ్-2 పరిధిలోకి వస్తుంది. ఈ విషయాన్ని అన్నా యూనివర్సిటీ గతంలోనే సర్వే చేసి స్పష్టంచేసింది. సీఆర్‌జెడ్-2లో ఎటువంటి శాశ్వత నిర్మాణాలూ చేపట్టడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కొత్త మాస్టర్ ప్లాన్-2041లో ఆ ప్రాంతం వినియోగాన్ని వ్యూహాత్మకంగా మార్చేసింది. పాత ప్లాన్ 2021లో రుషికొండ అటవీ ప్రాంతం, హిల్ ఏరియా అని పేర్కొని ఉండగా, కొత్త మాస్టర్‌ప్లాన్‌లో దానిని మిక్స్‌డ్ యూజ్‌కు అనుకూలంగా నివాసాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకునే వెసులుబాటు కల్పిస్తూ మార్పులు చేసింది.
పక్కా వ్యూహాత్మకం..
రుషికొండ విధ్వంసం వెనుక ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మాస్టరు ప్లాను మార్పుపై ఎటువంటి అభ్యంతరాలు రానందున, రుషికొండపై ‘ఏపీటీడీసీ’ కొత్త ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తున్నట్టు పేర్కొంది. ’ఏపీటీడీసీ’…వాటిని చూపించి, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి అనుమతులు తెచ్చుకుంది. కొండను తవ్వి రహదారులు వేయడానికి రూ.92 కోట్లు, భవన నిర్మాణాలకు మరో రూ.148 కోట్లు ప్రభుత్వం మంజూరుచేసింది. విశాఖ జిల్లాలో ఏడేళ్ల క్రితం ప్రారంభించి ఇప్పటికీ పూర్తికాని పర్యాటక ప్రాజెక్టులు అనేకం ఉం టే… వాటికి నిధులు ఇవ్వని ప్రభుత్వం, ఈ ప్రాజెక్టుకు మాత్రం ఏకంగా రూ.240 కోట్లు ఇవ్వడం అన్ని వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు తెచ్చిన ప్రభుత్వ అధికారులు రుషికొండలో నిబంధనలకు వ్యతిరేకంగా కొండను ధ్వంసం చేశారు. రహదారులు నిర్మించాలని, భవనాలకు స్థలం కావాలని భారీగా చెట్లను తొలగించారు. తవ్విన మట్టిని ఎక్కడెక్కడికో తరలించి అమ్ముకున్నారు. దీనిపై పర్యావరణ ప్రేమికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసులు వేశారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్‌జీటీలో కేసు వేశారు. దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఒక కమిటీని వేసి వివరాలు తెప్పించుకుంది. వాటిని పరిశీలించిన అనంతరం రుషికొండ నిర్మాణంపై అనేక అభ్యంతరాలు ఉన్నందున, వాటిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రత్యేక జాయింట్ కమిటీని నియమిస్తూ బుధవారం ఎన్ జీటీ ఆదేశాలు ఇచ్చింది.
Also Read: Gadapa Gadapaku YCP: గడగడపకు వెళితే గట్టి దెబ్బే.. వైసీపీ ప్రజాప్రతినిధులకు చుక్కలు
Recommended Videos