తెలంగాణ పీసీసీ చీఫ్ ఆయనేనా?

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉత్తం కుమార్ రెడ్డి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానం కోసం మల్కాజిగిరి ఎమ్.పి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లుభట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు,సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు వంటివారు క్యూలో ఉన్నారు. అయితే వీరందరిని కాదని భువనగిరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించవచ్చని సమాచారం. ఢిల్లీలో ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాందీని కలిశారని, ఆమె కోమటిరెడ్డిని పిసిసి అధ్యక్షునిగా నియమించాలన్న అభిప్రాయానికి వచ్చారని కాంగ్రెస్ లో […]

Written By: Neelambaram, Updated On : May 19, 2020 7:39 pm
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉత్తం కుమార్ రెడ్డి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానం కోసం మల్కాజిగిరి ఎమ్.పి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లుభట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు,సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు వంటివారు క్యూలో ఉన్నారు. అయితే వీరందరిని కాదని భువనగిరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించవచ్చని సమాచారం. ఢిల్లీలో ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాందీని కలిశారని, ఆమె కోమటిరెడ్డిని పిసిసి అధ్యక్షునిగా నియమించాలన్న అభిప్రాయానికి వచ్చారని కాంగ్రెస్ లో కొందరు నేతలు అంటున్నారు. తెలంగాణలో మరికొందరు నేతలు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు, అయినప్పటికీ పార్టీ అదిష్టానం కోమటిరెడ్డివైపు మొగ్గుచూపవచ్చని అంటున్నారు. మరో వారం , పది రోజులలో తెలంగాణ పిసిసి అద్యక్షుడు కోమటిరెడ్డి వెంకటిరెడ్డా..? లేక మీరెవరినైనా నియమిస్తారా అన్నది స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.