ఒకప్పుడు ఈనాడు మొదటి పేజీలో యాడ్స్ కోసం ‘నారాయణ’, ‘శ్రీచైతన్య’ విద్యాసంస్థలు కొట్టుకునేటివట. ఫస్ట్ పేజీకి 40 లక్షల యాడ్స్ ఇవ్వాల్సి ఉన్నా వీరి పోటీ కారణంగా 50 లక్షల వరకు పాట పోయేదట.. కానీ ఇప్పుడు పత్రికలు యాడ్స్ కోసం అడుక్కుంటున్న దుస్థితి దేశంలో నెలకొంది. ప్రాంతీయ ఈనాడు విషయంలోనే కాదు.. తాజాగా జాతీయ పత్రికలైన టైమ్స్ ఆఫ్ ఇండియా, దేశంలోనే అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న దైనిక్ భాస్కర్ విషయంలోనూ అదే యాతన ఉండడం పత్రికల దుస్థితికి అద్దం పడుతోంది.
Also Read: కేటీఆర్ రెడీ.. మరి లోకేష్?
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పత్రికలకు యాడ్స్ వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా అన్ని పత్రికలకు రిలయన్స్ జియోమార్ట్ లాంచింగ్ సందర్భంగా ప్రకటనలు ఇచ్చింది. అన్ని కార్పొరేట్ దిగ్గజాలు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అంటూ పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చాయి. అయితే పాత రేట్లకు కాదు.. కొత్త రేట్లకు.. యాడ్స్ ఇవ్వండి మహాప్రభో అని పత్రికలే పారిశ్రామిక దిగ్గజాలు, కంపెనీలను అడుక్కునే పరిస్థితి నెలకొంది.
దేశంలోనే టాప్ పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ దేశవ్యాప్తంగా ఫస్ట్ పేజీ ఫుల్ యాడ్ కు కరోనాకు ముందు ఏంత లేదన్నా దాని సర్క్యూలేషన్ ప్రకారం.. కోటి రూపాయలు తీసుకునేదట.. కన్షెషన్ అడిగితే.. తెలిసిన వారుంటే 50లక్షల వరకు ఖచ్చితంగా తీసుకునేవారట.. కానీ ఇప్పుడు తాజాగా అదే యాడ్ ను కేవలం లక్షన్నరకు .. రెండు లక్షలకు ఒక పేజీ యాడ్ వేసిన దౌర్భాగ్యం నెలకొంది. ఇక ఈనాడు మొదటి పేజీ కరోనాకు ముందు 40లక్షలు, సాక్షి 30 లక్షలుండేది. ఇప్పుడు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాయట.. బేరం ఆడడం లేదు. ఇచ్చిందే పదివేలు అంటూ క్యాష్ చేసుకుంటున్నాయి.
Also Read: కేంద్ర మంత్రి పదవి వీరిద్దరికి ఖాయమేనా?
కరోనా దెబ్బ పత్రికలపై భారీగా పడింది. వాటిని కోలుకోకుండా చేసింది. ఇప్పటికే ఈనాడు ఉద్యోగులకు లేఆఫ్ లు ఇచ్చేయగా.. ఆంధ్రజ్యోతి హోల్డ్ పేరిట సాగనంపింది. నమస్తే తెలంగాణ ఉద్యోగులకు నమస్తే పెట్టి ఏకంగా తొలగించేసింది. సాక్షి మాత్రమే ఏపీలో అధికారబలంగా ఇలా తీసివేతలు లేకుండా ఠీవీగా నిలబడింది.
ఈ కరోనా కష్టకాలంలో పత్రికలను నడపడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో తాజాగా ప్రకటనలకు ఏమాత్రం డిమాండ్ చేయకుండా ఎంత ఇస్తే అంత తీసుకొని యాడ్స్ వేసుకున్న దౌర్భాగ్యం కనిపిస్తోందని మీడియా వర్గాలు వాపోతున్నాయి.