కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ప్రతీరోజు ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పేద, ధనిక, చిన్న, పెద్దా అనే తేడా లేకుండా కరోనా మహమ్మరి అందరిని కబళించేందుకు చూస్తోంది. కరోనా నిబంధనలు పాటించకుండా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో.. వారినే టార్గెట్ చూస్తూ ముందుకెళుతున్నారు. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. ఇక చిన్న చితక దేశాల సంగతి ఇంకా చెప్పనక్కర్లేదు.
Also Read: టిడిపిలో ఆ మాజీ మంత్రి మిస్సింగ్..! దొరికితే కటకటాల వెనక్కే…?
చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. ఇక్కడ.. అక్కడ అనే తేడా లేకుండా ప్రపంచమంతటా కరోనా వ్యాపించింది. కరోనా రోజురోజుకు విజృంభిస్తుండటంతో కొన్ని దేశాలు లాక్డౌన్ విధించి వైరస్ కట్టడికి పూనుకున్నాయి. దీంతో కొంతమేర మాత్రమే కరోనా కట్టడి అయింది. అయితే అది పూర్తిస్థాయిలో కరోనా కట్టడి కాలేదు. దీంతో ఆయా ప్రభుత్వాలు డబ్ల్యూహెచ్ నిబంధనలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించడం.. చేతులను శానిటైజ్ చేసుకోవడం.. భౌతిక దూరం పాటిస్తున్నారు.
ఇదిలా ఉంటే న్యూజిలాండ్ దేశం కరోనాపై పూర్తిస్థాయి విజయం సాధించింది. అక్కడ గడిచిన వంద రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని తాజాగా న్యూజిలాండ్ ప్రభుత్వమే ప్రకటించింది. అక్కడ ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన 23మందికి మాత్రమే కరోనా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. వీరందరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత వందరోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడం గొప్ప విషయమని అక్కడి హెల్త్ డైరెక్టర్ జనరల్ యాష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు.
Also Read: ఈ సారి జగన్ సెగ డైరెక్ట్ కోర్టుకే తగిలింది..! అంత తొందర ఏల నాయకా…?
ఇక న్యూజిలాండ్ జనాభా మొత్తం సుమారు 50లక్షలు. దేశంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతోనే మార్చి 19 నుంచే న్యూజిలాండ్లోకి విదేశీయుల రాకను నిలిపివేసింది. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో 1,219 కరోనా కేసులు ఉండగా ఇప్పుడు పూర్తిస్థాయి కంట్రోల్ చేయగలిగింది. న్యూజిలాండ్లో మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేశారు. అలాగే భౌతిక దూరం నిబంధనను ప్రజలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని 14రోజులపాటు క్వారంటైన్ చేసింది.
కరోనా మహమ్మరిపట్ల న్యూజిలాండ్ పకడ్భందీ చర్యలు చేపట్టి విజయం సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. న్యూజిలాండ్ ను ఆదర్శంగా తీసుకొని అన్నిదేశాల కరోనా కట్టడి చర్యలు తీసుకుంటే కరోనాపై విజయం సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.