New Year Restrictions in AP: ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులు చాప కింద నీరులా రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు విధించగా, మరి కొన్ని ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇకపోతే న్యూ ఇయర్ వేళ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఎక్కువ మంది గుమిగూడే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కట్టడికిగాను ఏపీ సర్కారు చర్యలు తీసుకుంది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పలు ఆంక్షలు విధించింది.

విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ వేడుకల వేళ ఇంకా కేసులు పెరిగే అవకాశముంది. అందుచేత ఏపీ సర్కారు అలర్ట్ అయి ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఏపీలోని పలు సిటీస్‌పైన ఫోకస్ పెట్టింది. నూతన సంవత్సరం సందర్భంగా జనాలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు ఉంటాయని ఏపీ సర్కారు హెచ్చరిస్తోంది.
డిసెంబర్ 31 రోజున ఏపీలోని ప్రధాన నగరాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకుగాను అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మద్యం తాగి వెహికల్స్ నడపొద్దని సూచిస్తున్నారు. ప్రమాదం పొంచిన ప్రదేశాల్లో నిఘా పెట్టడంతో పాటు బీచ్ రోడ్డులో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు అధికారులు. డిసెంబర్ 31న ఈవినింగ్ 5 గంటల నుంచి బీచ్ రోడ్డులో విధించిన ఆంక్షల ప్రకారం.. వాహనాలు ఆయా ప్రాంతాల్లోకి అనుమతించరు. భీమిలీ వరకూ నిఘా పెట్టారు. విశాఖ సిటీలోని మెయిన్ జంక్షన్స్ వద్ద స్పెషల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బ్రీత్ అనలైజర్స్ ద్వారా తనిఖీలు చేపట్టాలని ముమ్మరంగా చేపట్టాలని నిర్ణయించారు. తెలుగుతల్లి ఫై ఓవర్‌తో పాటు ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తిగా మూసేసి, వెహికల్స్‌ను కింది నుంచి మాత్రమే అనుమతిస్తున్నారు.
Also Read: న్యూఇయర్ పై ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఆంక్షల మధ్యే సెలబ్రెషన్స్..!
లా అండ్ ఆర్డర్ విభాగం అధికారులు కూడా స్పెషల్ చర్యలు తీసుకుంటున్నారు. చోరీలు, ఈవ్ టీజింగ్‌లకు ఆస్కారం లేకుండా చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రసర్కారు నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ మరిన్ని ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. నూతన సంవత్సరం 2022 వేడుకలపై ఇప్పటికే అధికారులతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లు వినికిడి. ఎటువంటి ఆంక్షలు విధించాలనే విషయమై స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు టాక్. ఈ క్రమంలోనే నైట్ కర్ఫ్యూ నిబంధనపై స్పయంగా సీఎం జగన్ త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఏపీలో ప్రజెంట్ ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. కాగా, భవిష్యత్తులో పెరగకుండా ఉండేందుకుగాను ముందు జాగ్రత్తగా పలు ఆంక్షలు విధించాలని ఆశిస్తున్నట్లు సమాచారం.
Also Read: Happy New Year 2022 Wishes, Images, Greetings, Quotes, Messages in Telugu