ఇటీవల సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన ఎంపీ రఘురామ రాజు బెయిల్ పై విడుదలయిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఎంపీ ఆ తరువాత ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే పోలీస్ కస్టడీలో ఉన్నా ఢిల్లీకి వెళ్లిన రఘురామపై తాజాగా సీఐడీ కోర్టు కస్టడీని పొడగించింది. ఆయన అనధికారికంగా విడుదలై పోరాన్న అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన కస్టడీనీ ఈనెల 25 వరకు పొడగిస్తూ తాజాగా సీఐడీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రఘురామ వర్గీయుల్లో ఆందోళన నెలకొంది.
కొన్ని రోజుల కిందట సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఎంపీ ఆ తరువాత హుటా హుటీన ప్రత్యేక చార్టర్ట్లో ఢిల్లీకి వెళ్లారు. అయితే ఆయన తరుపున న్యాయవాదులు మాత్రం ఆయన డిశ్చార్జీ సమ్మరీని కోర్టులో సమర్పించాలని, అది ఇస్తేనే బెయిల్ మంజూరవుతుందని అన్నారు. దీంతో రఘురామ డిశ్చార్జి అయిన మూడు రోజుల తరువాత ఆయన తరుపన న్యాయవాదులు బాండ్లు సమర్పించారు. వాటిని కోర్టు సీఐడీ అధికారులకు పంపింది. దీంతో బెయిల్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.
అయితే సీఐడీ అధికారులు మాత్రం వాటిని తిరిగి ఆర్మీ ఆసుపత్రికి పంపారు. తరువాత ఆసుపత్రి బాండ్లను మరోసారి సీఐడీ అధికారులకు పంపారు. అయితే ఈసారి సీఐడీ అధికారులు సైలెంట్ అయ్యారు. దీంతో ఆలస్యం కావడంతో సీఐడీ కోర్టు రఘురామ బెయిల్ ను పొడిగించింది. ఇదిలా ఉండగా రఘురామను పోలీస్ స్టేషన్ కు తరలించాలని సీఐడీ అధికారులు ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు. అయితే రఘురామ ఫిర్యాదు వల్ల గుంటూరు ఎస్పీని బదిలీ చేశారు. దీంతో రఘురామను వదిలిపెట్టేది లేదన్న కోణంలో పోలీసులు ఇలా చేస్తున్నారని రఘురామ తరుపు న్యాయవాదులు అంటున్నారు. దీంతో ఆయన కేసు అనుక మలుపులు తిరుగుతోంది.